Telugu Global
Health & Life Style

సమ్మర్‌‌లో ఎక్కువగా నిద్రిస్తున్నారా! ఇవి తెలుసుకోండి!

సమ్మర్‌‌లో ఇంటిపట్టున ఉండేవాళ్లు కాస్త ఎక్కువగా నిద్రించడం మామూలే. ఉదయాన్నే లేట్‌గా లేవడంతో పాటు మధ్యాహ్నం టైంలో కూడా ఓ కునుకు తీస్తుంటారు. అయితే మొత్తం మీద రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకుంటే పర్వాలేదు. కానీ, పది గంటలకు మించి నిద్రపోతే మాత్రం కొన్ని ఇబ్బందులుంటాయి.

సమ్మర్‌‌లో ఎక్కువగా నిద్రిస్తున్నారా! ఇవి తెలుసుకోండి!
X

నిద్ర అనేది రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగం. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పగలు యాక్టివ్‌గా ఉండాలంటే రాత్రిళ్లు తగినంత నిద్ర పోవాలి. అలాగని నిద్ర మరీ ఎక్కువైనా ఇబ్బందే.. అతి నిద్ర వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..

సమ్మర్‌‌లో ఇంటిపట్టున ఉండేవాళ్లు కాస్త ఎక్కువగా నిద్రించడం మామూలే. ఉదయాన్నే లేట్‌గా లేవడంతో పాటు మధ్యాహ్నం టైంలో కూడా ఓ కునుకు తీస్తుంటారు. అయితే మొత్తం మీద రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకుంటే పర్వాలేదు. కానీ, పది గంటలకు మించి నిద్రపోతే మాత్రం కొన్ని ఇబ్బందులుంటాయి.

సమ్మర్‌‌లో చాలామంది ఇంటిపట్టునే ఉంటారు. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు నిద్రపోతూనే ఉండడం వల్ల క్రమంగా బరువు పెరిగే అవకాశముంటుంది. అలాగే జీర్ణక్రియ మందగిస్తుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలొస్తాయి.

ఎక్కువగా నిద్రించడం వల్ల డయాబెటిస్, గుండె సమస్యల రిస్క్ పెరుగుతుందని స్టడీల్లో తేలింది. శరీరానికి ఎక్కువసేపు విశ్రాంతి ఇవ్వడం ద్వారా మెటబాలిజం, రక్త ప్రసరణ తగ్గుతాయి. కాబట్టి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

ఎక్కువసేపు నిద్రించడం వల్ల కొన్ని మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి నిద్ర వల్ల మెదడులోని హార్మోన్స్‌లో మార్పులొస్తాయి. ఫలితంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే అతి నిద్ర వల్ల సెరోటోనిన్ లెవల్స్ బ్యాలెన్స్ కోల్పోయి తలనొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి.

మన శరీరానికి నిర్ధిష్టమైన స్లీప్ సైకిల్ ఉంటుంది. దానికి విరుద్ధంగా పగలు కూడా నిద్రపోవడం వల్ల అది మెదడు పనితీరు దెబ్బతిని, నాడీ వ్యవస్థ ప్రభావితమయ్యేలా చేస్తుంది.

ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతాయని స్టడీల్లో తేలింది. పది గంటలకు పైగా నిద్రపోయేవాళ్లు మేల్కొవడానికి ఇబ్బంది పడడం, రోజంతా అలసట, నీరసంగా ఉండడం కామన్‌గా జరుగుతుంటుంది.

ఇక వీటితోపాటు ఎక్కువసేపు పడుకొని ఉండడం వల్ల కండరాలు ఒత్తిడికి గురై వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటివి ఎక్కువ అవుతాయి.

సమ్మర్‌‌లో డే టైమ్‌లో పడుకోవాలనిపిస్తే 40 నిముషాలకు మించి ఎక్కువ నిద్ర పోకూడదు. అలాగే రాత్రిళ్లు ఎనిమిది లేదా తొమ్మిది గంటలకు మించి నిద్ర పోవడం అంత మంచిది కాదు.

First Published:  30 April 2024 9:44 PM IST
Next Story