Telugu Global
Health & Life Style

ఫోన్ ఎక్కువగా వాడితే బరువు పెరుగుతారా?

ప్రస్తుతం పెరుగుతున్న ఒబెసిటీ సమస్యకి మొబైల్ వాడకం కూడా ఒక కారణమని మీకు తెలుసా? రీసెంట్‌గా జరిపిన కొన్ని స్టడీలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. మితి మీరిన మొబైల్ వాడకం వల్ల చాలామంది యువత ఒబెసిటీ బారిన పడుతున్నారట.

ఫోన్ ఎక్కువగా వాడితే బరువు పెరుగుతారా?
X

ప్రస్తుతం పెరుగుతున్న ఒబెసిటీ సమస్యకి మొబైల్ వాడకం కూడా ఒక కారణమని మీకు తెలుసా? రీసెంట్‌గా జరిపిన కొన్ని స్టడీలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. మితి మీరిన మొబైల్ వాడకం వల్ల చాలామంది యువత ఒబెసిటీ బారిన పడుతున్నారట. దీన్నెలా అరికట్టాలంటే..

ఈ రోజుల్లో ప్రతి చిన్న పనికి మొబైల్ మీదే ఆధారపడాల్సి వస్తోంది. కరెంటు బిల్లు కట్టడం నుంచి ఫుడ్ ఆర్డర్ వరకూ అంతా మొబైల్ ద్వారానే జరిగిపోతుంది. దీనివల్ల చాలా వరకూ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతోంది. దీంతోపాటు మొబైల్ వాడకం వల్ల ఒత్తిడి పెరిగి బరువు పెరగడానికి కారణమవుతోంది.

కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం మన దేశంలో సగటున ఒక వ్యక్తి రోజుకి 7.3 గంటలు ఫోన్‌ వాడుతున్నాడట. ఇది అమెరికా, చైనా దేశాల కంటే ఎక్కువ. ఇలా స్క్రీన్ టైం ఎక్కువవ్వడం వల్ల ఫిజికల్ హెల్త్ పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా పిల్లలపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. మొబైల్, టీవీలు ఎక్కువగా చూసే పిల్లల్లో సుమారు 60 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు కొన్ని స్టడీల ద్వారా తెలుస్తోంది. ఇదిలాగే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో యువత ఆయుర్ధాయం క్షీణిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

జాగ్రత్తలు ఇలా..

టీవీలు, ఫోన్‌లలో వీడియోలు చూపిస్తూ పిల్లలకు అన్నం తినిపించడం లేదా ఇంట్లో తినేటప్పుడు టీవీ పెట్టడం వంటి అలవాట్లు మానుకోవాలి. పిల్లల చేతికి మొబైల్స్, ట్యాబ్స్ ఇవ్వకుండా పేరెంట్సే జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫోన్ ఎక్కువగా చూడడం, సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపడం వల్ల ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం బరువుపై పడుతుంది. కాబట్టి రోజుకి మూడు గంటలకు మించి మొబైల్ వాడకుండా రూల్ పెట్టుకోవాలి.

బరువు పెరిగే ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ రోజుకి అరగంట సేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ గేమింగ్‌కు బదులు అవుట్‌డోర్ గేమ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

First Published:  15 Aug 2024 2:52 PM IST
Next Story