హెల్దీ లైఫ్ కోసం బెస్ట్ న్యూట్రిషన్ చిట్కాలు!
దేశంలో పెరుగుతున్న అనారోగ్యాలను నివారించడంలో భాగంగా జాతీయ పోషకాహార సంస్థ కొన్ని డైట్ సూత్రాలను సూచించింది. వీటిని అనుసరించడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా హెల్దీ లైఫ్‌ను లీడ్ చేయొచ్చని సూచిస్తోంది.
దేశంలో పెరుగుతున్న అనారోగ్యాలను నివారించడంలో భాగంగా జాతీయ పోషకాహార సంస్థ కొన్ని డైట్ సూత్రాలను సూచించింది. వీటిని అనుసరించడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా హెల్దీ లైఫ్‌ను లీడ్ చేయొచ్చని సూచిస్తోంది.
రోజువారీ జీవితంలో తినే ఆహారపదార్థాలు, వంట చేసే పద్ధతులను మార్చుకోవడం ద్వారా సగం సమస్యలను నివారించొచ్చంటోంది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
నీళ్లు తాగే విషయంలో మరిగించిన నీటిని ఎంచుకోవడం మంచిది. కనీసం పది నిముషాల పాటు మరిగించి ఆ నీటిని తాగితే రోగాలు రావు. అలాగే రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. చెమట బాగా పట్టినప్పుడు మరిన్ని నీళ్లు తాగాలి. నీరసంగా అనిపించినప్పుడు కొబ్బరినీళ్లు తాగడం అన్నింటికంటే మంచి ఆప్షన్. అలాగే క్యాల్షియం కోసం రోజుకి ఒక గ్లాసు పాలు కూడా తాగొచ్చు. హెల్దీగా ఉండాలంటే కూల్ డ్రింక్స్ జోలికి పోవద్దు.
వంట చేసే విషయంలో ఒకసారి వాడిన నూనెను మరోసారి వాడకూడదు. కావాలంటే తాలింపుకు వాడొచ్చు. రెడీ -టూ ఈట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అలాగే వంట కోసం వనస్పతిని వాడకూడదు. రిఫైన్డ్ ఆయిల్స్ కూడా అనారోగ్యకరమే. ఇకపోతే ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలను వేడి చేసిన తర్వాతే తినాలి. వండిన ఆహారాలను ఆరు గంటల్లోగా తీసుకుంటే మంచిది.
ఇక డైట్ విషయానికొస్తే.. ప్రతి ఒక్కరూ హెల్దీ ఫ్యాట్స్‌ను తప్పక తీసుకోవాలని పోషకాహార సంస్థ సూచిస్తోంది. వీటికోసం డ్రై ఫ్రూట్స్, నట్స్, చేపలు, కోడిగుడ్ల వంటివి తీసుకోవచ్చు. అలాగే రోజుకి రెండు స్పూన్ల నెయ్యి కూడా మంచిదే. డైట్‌లో కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉంటే పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఫ్రైడ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యుస్‌లు, ఆల్కహాల్ వంటివి మానేయాలి. రోజుకి 60 మి.లీ. కన్నా ఎక్కువ మద్యం తీసుకునే వారికి రక్తపోటు, గుండె పోటు, నోటి క్యాన్సర్ ప్రమాదం ఉంటుంది.