Telugu Global
Health & Life Style

రెడ్​మీట్​తో క్యాన్సరే కాదు, టైప్‌-2మధుమేహం కూడానా?

ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న మాట మాంసాహార ప్రియుల నుంచి తరచుగా వింటూనే ఉంటాం. అయితే, అలాంటి వారు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు రెడ్ మీట్ తింటే కాన్సర్ వస్తుంది కొన్ని అధ్యయనాలు చెప్పాయి.

రెడ్​మీట్​తో క్యాన్సరే కాదు, టైప్‌-2మధుమేహం కూడానా?
X

ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న మాట మాంసాహార ప్రియుల నుంచి తరచుగా వింటూనే ఉంటాం. అయితే, అలాంటి వారు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు రెడ్ మీట్ తింటే కాన్సర్ వస్తుంది కొన్ని అధ్యయనాలు చెప్పాయి.

అయితే రెడ్‌ మీట్‌ను తినడం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లోని సుమారు 19 లక్షల మందిపై ఆహారపు అలవాట్లకు సంబంధించిన పదేళ్ల డాటాను ఈ అధ్యయనంలో విశ్లేషించారు. ఈ నివేదికను ‘ది లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రినాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు.

అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, మెక్సికో వంటి దేశాల పరిశోధకులతో అంతర్జాతీయ బృందం ఈ అధ్యయనం చేసింది. రోజూ 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్​ తీసుకునేవారికి మధుమేహం ముప్పు 15% ఎక్కువని, రోజూ 100 గ్రాముల రెడ్ మీట్ తీసుకునే వారికి ఈ ముప్పు 10%, రోజూ 100 గ్రాముల చికెన్ తీసుకునే వారికి 8% ఎక్కువని తమ స్టడీలో తేలిందన్నారు. 20 లక్షల మందికి సంబంధించిన డేటా పరిశీలించగా కొద్ది కాలం తరువాత వారిలో లక్ష మంది టైప్ 2 మధుమేహం బారిన పడ్డారని తెలిపారు.

రెడ్ మీట్ అంటే పెద్ద ,చిన్న జంతువుల మాంసం(మటన్, బీఫ్, పోర్క్.). అంటే సాధారణంగా మాంస ప్రియులు తినేది ఇదే. ఈ అధ్యానంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సిఫారసు చేసిన పరిమాణం కన్నా ఎక్కువగా మాంసాన్ని తింటున్నారని దీనికి, టైప్‌-2 డయాబెటిస్‌ సహా అసాంక్రమిక వ్యాధులు రావడానికి సంబంధం ఉన్నట్లు నిర్ధారణ చేసారు. అయితే, రెడ్ మీట్‌లో పుష్కలంగా ప్రొటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్ ఉంటాయి అనేది కూడా నిజం.

భారతదేశంలో దీని వినియోగం తక్కువే కానీ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో రెడ్ మీట్ వినియోగం చాలా ఎక్కువ. అయితే, రెడ్ మీట్ కు బదులుగా చికెన్ తీసుకుంటే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందా అంటే అలా కూడా ఖచ్చితంగా చెప్పలేమని, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కనిపించలేదని పేర్కొన్నారు.

First Published:  22 Aug 2024 2:30 PM IST
Next Story