Telugu Global
Health & Life Style

మాంసాహారం ఆరోగ్యానికి మంచిదేనా?

మాంసాహారం తినడంలో చాలామందికి చాలారకాల అనుమానాలుంటాయి. ఒకరు చికెన్ మంచిదంటే.. ఇంకొకరు మటన్ మంచిదంటారు. ఈ రెండిటి కంటే చేపలు, రొయ్యలు మేలంటారు ఇంకొందరు.

Is meat good for health?
X

మాంసాహారం తినడంలో చాలామందికి చాలారకాల అనుమానాలుంటాయి. ఒకరు చికెన్ మంచిదంటే.. ఇంకొకరు మటన్ మంచిదంటారు. ఈ రెండిటి కంటే చేపలు, రొయ్యలు మేలంటారు ఇంకొందరు. మాంసాహారంపై ఇలా రకరకాల వాదనలున్నాయి. ఇంతకీ ఏ మాంసం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

నాన్‌వెజ్ తినేందుకు చాలారకాల ఆప్షన్స్ ఉన్నాయు. చికెన్, మటన్, ఫిష్ ఇలా బోలెడు. అయితే వీటన్నింటిని రెడ్ మీట్, వైట్ మీట్ అని రెండు రకాలుగా డివైడ్ చేశారు. రెడ్ మీట్ అంటే మటన్, పోర్క్ వంటివి. వైట్ మీట్ అంటే చేపలు, కోడి, రొయ్యలు, పక్షులు వంటివి. వీటిలో ఏది బెస్ట్ అంటే..

ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్

మాంసాహారంలో ప్రధానంగా ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే మటన్‌, పోర్క్‌ వంటి వాటిలో ప్రొటీన్‌తో పాటు ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కొవ్వు, కొలెస్ట్రాల్ రిస్క్‌ వద్దనుకునేవాళ్లు మటన్‌కి బదులు చికెన్‌ను ఎంచుకోవచ్చు. చికెన్‌లో కేవలం ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. జిమ్‌కు వెళ్లేవాళ్లు, కండలు పెంచాలనుకునేవాళ్లకు చికెన్ బెస్ట్ ఆప్షన్.

ఇక మటన్ విషయానికొస్తే ఇందులో ప్రోటీన్‌తో పాటు కాస్త కొలెస్ట్రాల్‌, ఫ్యాట్స్‌ కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది లేదనుకుంటే మటన్‌ తినొచ్చు. ఇక ఈ రెండు ఆరోగ్యానికి అంత మంచివి కావనుకుంటే చేపలు, రొయ్యలు తినొచ్చు. వీటితో నష్టం చాలా తక్కువ. వీటిలో ప్రొటీన్‌తో పాటు ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి.

నష్టం కూడా..

ప్రొటీన్లు, మెగ్నీషియం, విటమిన్ బీ12, జింక్ వంటి వాటికోసం మాంసం మంచి ఆప్షనే అయినప్పటికీ.. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ సంస్థ చేసిన ఓ రీసెర్చ్‌లో మాంసం ఏదైనా కొలెస్ట్రాల్ మీద ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతుందని తేలింది. మాంసాహారం మితంగా తింటేనే మంచిదని, నెలలో మూడు సార్లకు మించి తింటే కొలెస్ట్రాల్‌, గుండె జబ్బుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

First Published:  9 Aug 2024 12:00 PM IST
Next Story