Telugu Global
Health & Life Style

మామిడి పండ్లపై అపోహలు.. వాస్తవాలు!

పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి పండ్లపై రకరకాల అపోహలు ఉన్నాయి. అయితే వాటిలో ఏవి అపోహలు? ఏవి వాస్తవాలు? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండ్లపై అపోహలు.. వాస్తవాలు!
X

సమ్మర్‌‌లో మాత్రమే లభించే మామిడి పండ్లను కొంతమంది ఇష్టంగా తింటుంటే.. మరికొంతమంది భయంతో దూరం పెడుతుంటారు. మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందని, మొటిమలు వస్తాయని, షుగర్ పెరుగుతుందని.. ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మరి వీటిలో వాస్తవమెంత?

పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి పండ్లపై రకరకాల అపోహలు ఉన్నాయి. అయితే వాటిలో ఏవి అపోహలు? ఏవి వాస్తవాలు? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందని, మొటిమలొస్తాయి అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. ఇందులో నిజం లేదని నిపుణులు చెప్తున్నారు. మామిడి పండ్లకు వేడికి ఎలాంటి సంబంధం లేదు. అలాగే వీటిలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మానికి మేలు జరుగుతుందే గానీ కీడు జరగదు. అయితే మామిడి పండ్లను తీసుకునేముందు శుభ్రంగా కడిగి తీసుకోవడం మంచిది.

మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారు అన్న అపోహ కూడా ఉంది. అయితే ఇందులో కూడా వాస్తవం లేదు. మామిడి పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో క్యాలరీలు, షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ దానివల్ల బరువు పెరిగే ప్రమాదం లేదంటున్నారు డాక్టర్లు. అయితే షుగర్ ఉన్నవాళ్లు వీటిని మితంగా తీసుకుంటే మంచిది.

మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదని అంటుంటారు చాలామంది. ఇందులో కొంత నిజం ఉంది. ఎందుకంటే మార్కెట్లో దొరికే పండ్లు పూర్తిగా మగ్గినవి కావు. కాబట్టి వీటిని గాలి తగిలేలా ఉంచితేనే మరింత తాజాగా ఉంటాయి. ఫ్రిజ్‌లో పెడితే మగ్గకపోగా త్వరగా పాడైపోతాయి.

గర్భిణులు మామిడి పండ్లు తినకూడదన్న అపోహ కూడా ఉంది. అయితే ఇందులో కూడా నిజం లేదు. ఇందులో ఉండే పోషకాలు గర్భిణులకు కూడా మేలు చేస్తాయి. అయితే షుగర్, ఒబెసిటీ ఉన్నవాళ్లు మితంగా తీసుకుంటే మంచిది.

First Published:  21 May 2024 4:39 AM GMT
Next Story