Telugu Global
Health & Life Style

కేరళలో మంకీపాక్స్‌ కలకలం

తాజాగా రాష్ట్రంలో రెండు కేసులు నమోదైనట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడి

కేరళలో మంకీపాక్స్‌ కలకలం
X

ప్రాణాంతక మంకీపాక్స్‌ వైరస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. యూఏఈ నుంచి ఇటీవల వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. వయనాడ్‌కు చెందిన వ్యక్తికి మొదట నిర్ధారణ కాగా.. తాజాగా కన్నూర్‌ వాసికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వైరస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ కొన్ని మంకిపాక్స్‌ కేసులు నమోదైన విషయం విదితమే.

First Published:  18 Dec 2024 7:41 PM IST
Next Story