Telugu Global
Health & Life Style

మగవారిలో పెరుగుతున్న లంగ్ క్యాన్సర్! జాగ్రత్తలు ఇలా..

లంగ్ క్యాన్సర్ అనేది మనదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్. ముఖ్యంగా మగవాళ్లలో ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. మనదేశంలోని క్యాన్సర్ మరణాల్లో లంగ్ క్యాన్సర్ శాతం 8.1 గా ఉంది.

మగవారిలో పెరుగుతున్న లంగ్ క్యాన్సర్! జాగ్రత్తలు ఇలా..
X

లంగ్ క్యాన్సర్ అనేది మనదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్. ముఖ్యంగా మగవాళ్లలో ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. మనదేశంలోని క్యాన్సర్ మరణాల్లో లంగ్ క్యాన్సర్ శాతం 8.1 గా ఉంది. వీరిలో ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువ. అసలు లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మనదేశంలో పెరుగుతున్న లంగ్ క్యాన్సర్‌‌కు పొగాకు ముఖ్యకారణంగా ఉంటోంది. లంగ్ క్యాన్సర్ బారిన పడినవాళ్లలో సుమారు 80 శాతం మందికి పొగాకు అలవాటు ఉన్నట్టు స్టడీలు చెప్తున్నాయి. ఈ క్యాన్సర్ లక్షణాలు, ట్రీట్మెంట్ స్టేజ్‌లు ఎలా ఉంటాయంటే..

లంగ్ క్యాన్సర్ లక్షణాలు దాదాపు టీబీ లక్షణాలను పోలి ఉంటాయి. విపరీతమైన దగ్గు, జ్వరం, రక్తంతో కూడిన కఫం, బరువు తగ్గటం, రొప్పు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, ఛాతి నొప్పి వంటివి లంగ్ క్యాన్సర్ లక్షణాలు. క్యాన్సర్​ మొదటి స్టేజ్​లో కేవలం పొడి దగ్గు మాత్రమే వస్తుంది. మూడు లేదా నాలుగు వారాల పాటు ఆగకుండా దగ్గు వస్తుంటే ఆలస్యం చేయకుండా డాక్టర్​ని కలవాలి. దగ్గుతో పాటు కఫం, కఫంలో రక్తం కనిపించడం వంటివి గుర్తిస్తే జబ్బు ఇంకా మదిరినట్టు లెక్క. మొదటి స్టేజ్‌లో జబ్బుని గుర్తిస్తే ట్రీట్మెంట్ చేయడం సులభమవుతుంది. స్టేజ్ ముదిరే కొద్దీ ట్రీట్మెంట్ అవకాశాలు తగ్గుతాయి.

లంగ్ క్యాన్సర్ మొదటి దశలో ఉన్నప్పుడే గుర్తిస్తే.. సర్జరీ లేదా కీమోథెరపీ వంటి చికిత్సల ద్వారా క్యాన్సర్ కణితిని తొలగిస్తారు. క్యాన్సర్ మూడు, నాలుగో నాలుగో దశలకి చేరుకుంటే క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాపించి ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతుంది. ఇది ప్రాణాపాయ స్థితిని కలుగజేస్తుంది.

జాగ్రత్తలు ఇలా..

లంగ్ క్యాన్సర్ కేసుల్లో కేవలం 2 శాతం మాత్రమే జన్యు పరమైనవి. మిగతావన్నీ పొగాకు లేదా ఇతర అనారోగ్య కారణాల వల్ల సంభవిస్తున్నవే. కాబట్టి పొగతాగే అలవాటున్న వాళ్ల వెంటనే దాన్ని మానుకోవాలి. సిగరెట్, బీడీలతో పాటు గుట్కా, జరదా వంటివాటికి కూడా దూరంగా ఉండాలి. పొగాకు నమలడం ద్వారా నోటి క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది.

పెరుగుతున్న పొల్యూషన్ కూడా లంగ్ క్యా్న్సర్ రిస్క్‌ను పెంచుతోంది. కాబట్టి సిటీల్లో ఉండేవాళ్లు పొల్యూషన్‌కు ఎక్స్‌పోజ్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. రోజూ కాసేపు వ్యాయామం చేయాలి. అప్పుడప్పుడు లంగ్స్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటుండాలి.

First Published:  15 July 2024 5:58 PM GMT
Next Story