Telugu Global
Health & Life Style

మెనోపాజ్ కి ముందే ఇలా సిద్ధపడదాం!

మెనోపాజ్‌కి 5-7 సంవత్సరాలకు ముందు నుంచే శరీరంలో మార్పులు ప్రారంభమవుతాయి.

మెనోపాజ్ కి ముందే ఇలా సిద్ధపడదాం!
X

మోనో పాజ్.. ప్రతి మహిళ జీవితంలో తప్పక ఎదుర్కొవాల్సిన సమస్య. రజస్వల అయినప్పటి నుంచి ప్రతీ నెలా వచ్చే రుతు చక్రం ముందుగా గతి తప్పుతుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు..కోపం..ఇరిటేషన్, మతిమరుపు, జుట్టు రాలటం, తలనొప్పి, నిద్రపట్టకపోవటం, శరీరంలో వేడి ఆవిర్లు రావటం లాంటివి చాలా జరుగుతుంటాయి. అలా జరిగి జరికి చివరికి రుతు చక్రాలు పూర్తిగా ఆగిపోయాయి. దీన్ని మెనోపాజ్ అంటారు. ఈ విషయాలు చాలా మంది గుర్తించగలరేమో కానీ ఎవరికీ చెప్పుకోలేరు.

అసలు మహిళల్లో 40 ఏండ్లు దాటినప్పటి నుంచి జుట్టు పల్చబడటం, అలసట, కీళ్ల దగ్గర నొప్పుల్లాంటి శారీరక సమస్యలు మొదలవుతాయి. ఇలా జరుగుతున్నదంటే, మన ఆహారంలో ఏదో లోపం ఉందని అర్థం. అప్పటి నుంచే సరైన శ్రద్ద తీసుకుంటే మెనోపాజ్‌ సమయం వీలైనంత ప్రశాంతంగా గడచిపోతుంది. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇందుకంటే మెనోపాజ్‌కి 5-7 సంవత్సరాలకు ముందు నుంచే శరీరంలో మార్పులు ప్రారంభమవుతాయి. హార్మోన్ల స్థాయి కూడా నెమ్మదిగానే తగ్గుతుంది. కొన్ని హార్మోన్ల విడుదల ఎక్కువై శారీరకంగా మార్పులు జరుగుతాయి. సాధారణంగా 47 నుంచి 53 సంవత్సరాల లోపు ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయిపోతుంది.

శరీరంలో మార్పులు సంభవిస్తున్నట్టు తెలుసుకోగానే సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా చెక్ చేసుకోవాలి. సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యను గుర్తించి స్థానిక, సీజనల్, సంప్రదాయ ఆహారాన్ని స్వీకరించాలి. సప్లిమెంట్లపై ఆధారపడకుండా అన్నీ రకాల ఆహార పదార్ధాలు తీసుకోవాలి.

వయసు పెరిగేకొద్దీ ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల ఆస్టియోపొరోసిస్‌లాంటి ఎముకలు గుల్లబారే జబ్బులు వస్తాయి. పరిశోధనల ప్రకారం మహిళలకు రోజుకు 1.2 గ్రాముల కాల్షియం అవసరం. అందుకోసం ఆకుకూరలు, పాలు, కాల్షియం ఫోర్టిఫైడ్‌ ఆహారాలు తీసుకోవాలి. అలాగే కాల్షియంను శోషించుకునేందుకు విటమిన్‌-డి ఉపయోగపడుతుంది. ఎముకల్ని దృఢపరచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా పనిచేస్తుంది.

సూర్యరశ్మి, చేపలు, ఫోర్టిఫైడ్‌ ఆహారాల ద్వారా దీన్ని గ్రహించవచ్చు. అలాగే నరాలు, కండరాల పనితీరుతోపాటు రక్తంలో చక్కెర స్థాయుల్ని నియంత్రించడానికి మెగ్నీషియం సహకరిస్తుంది. గింజలు, తృణధాన్యాలు, ఆకుకూరల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది. గుండె ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అవిసె, చియా, గుమ్మడి తదితర గింజలు, చేపల్లో దొరుకుతాయి. ఇక రక్తంలో ఆక్సిజన్‌ సరఫరాకు ఇనుము చాలా ముఖ్యం. అలసట, నీరసంలాంటి వాటిని దూరం చేసేందుకు ఐరన్ అధికంగా ఉండే దినుసులు, చిక్కుడు జాతి గింజలు, బెల్లం వంటివి తీసుకోవాలి. జీర్ణవ్యవస్థను చురుగ్గా చేసి, గుండెజబ్బులు, మధుమేహం నివారణలో ఎంతగానో ఉపకరంచే పీచు పదార్ధాలు పండ్లు, ఆకుకూరలు, బీర, సొరకాయ లాంటి కూరగాయలు, చిక్కుళ్లలో ఇవి పుష్కలంగా లభిస్తాయి.

First Published:  21 Jun 2024 8:00 AM GMT
Next Story