ప్రొటీన్ పాయిజనింగ్ గురించి తెలుసా?
శరీరానికి కావల్సిన మూడు ముఖ్యమైన పోషకాల్లో ప్రొటీన్ ఒకటి. అయితే కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్ లాగానే శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగితే పలు సమస్యలు తప్పవు. ముఖ్యంగా ప్రొటీన్ ఎక్కువ అవ్వడం వల్ల జరిగే ‘ప్రొటీన్ పాయిజనింగ్’ గురించి చాలామందికి తెలియదు.
శరీరానికి కావల్సిన మూడు ముఖ్యమైన పోషకాల్లో ప్రొటీన్ ఒకటి. అయితే కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్ లాగానే శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగితే పలు సమస్యలు తప్పవు. ముఖ్యంగా ప్రొటీన్ ఎక్కువ అవ్వడం వల్ల జరిగే ‘ప్రొటీన్ పాయిజనింగ్’ గురించి చాలామందికి తెలియదు.
కండరాల పనితీరుకి, జీవక్రియల వేగం పెంచేందుకు శరీరానికి తగినంత ప్రొటీన్ అవసరం. డైట్‌లో తగినంత ప్రొటీన్ తీసుకోకపోతే కండరాల బలహీనత, ఒబెసిటీ, అలసట, చర్మ సమస్యల వంటివి వస్తాయి. అయితే శరీరం ప్రొటీన్‌ను నిల్వ చేసుకోదు. కాబట్టి ఏ రోజు ప్రొటీన్ ఆరోజు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగని మితిమీరి ప్రొటీన్ తీసుకున్నా ఇబ్బందే.
శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తించడానికి, ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయడానికి రోజుకు ఒక వ్యక్తికి.. తన బరువుని బట్టి కిలోకు 0.7 నుంచి 0.9 గ్రాముల ప్రొటీన్ అవసరం అని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తి బరువు 65 కిలోలు అయితే రోజుకి సుమారు 45 నుంచి 60 గ్రాముల ప్రొటీన్ అవసరం. అయితే రోజువారీ పనులు, ఫిట్‌నెస్, అనారోగ్య సమస్యలను బట్టి డాక్టర్ సలహా మేరకు ప్రొటీన్ ఇన్‌టేక్‌లో మార్పులు చేయొచ్చు.
ఒకవేళ ప్రొటీన్ తీసుకోవడం ఎక్కువైతే అది ప్రొటీన్ పాయిజనింగ్‌కు దారి తీయొచ్చు. వ్యక్తి బరువులో ఒక కిలోకి ఒక గ్రాము కంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటున్నట్టయితే కొంతకాలానికి అది ప్రొటీన్ పాయిజనింగ్‌గా మారే అవకాశం ఉంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం అలవాటైతే ముందుగా మలబద్ధకం సమస్య వస్తుంది. అలాగే పొట్ట ఉబ్బరం, జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ప్రొటీన్ ఎక్కువైతే అది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడ్డానికి కూడా కారణమవుతుంది. కాబట్టి ప్రొటీన్ ఇన్‌టేక్ విషయంలో జాగ్రత్త వహించడం అవసరం.
శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగినట్టు గుర్తిస్తే.. ప్రొటీన్ ఆహారాలు తగ్గించి ఫైబర్, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు వాకింగ్, జాగింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి.