Telugu Global
Health & Life Style

కిడ్నీల ఆరోగ్యం మన చేతుల్లోనే

కిడ్నీలు ఆరోగ్యం కోసం చేయాల్సినవి.. చేయకూడనివి ఏమిటో చెబుతున్న ఆరోగ్య నిపుణులు

కిడ్నీల ఆరోగ్యం మన చేతుల్లోనే
X

కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంటుందని, దాని కోసం చేయాల్సినవి, చేయకూడనివి ఏమిటి అన్నది వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం. రక్తపోటు ఉన్న వ్యక్తులు కిడ్నీ వ్యాధులతో మరింత జాగ్రత్తగా ఉండాలి. బీపీ 130/80 వద్ద ఉండేలా చూసుకోవాలి. షుగర్‌ పేషంట్లు రక్తంలో షుగర్‌ స్థాయిలను అదుపులో ఉండేలా చూసుకోవాలంటున్నారు.

ఉదయాన్నే వ్యాయామం, వాకింగ్‌ వంటివి చేయాలి. శరీరాన్ని తరుచూ కదిలిస్తూ యాక్టివ్‌గా ఉంచాలి. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) ప్రకారం చూసుకొని అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే దీర్ఘకాల వ్యాధులకు ఉపయోగించే మందులను జాగ్రత్తగా వాడాలి. తరచూ మెడికల్‌ చెకప్‌లు చేయించుకోవాలి. ప్రిస్క్రిప్షన్‌కు తగ్గట్టుగా మందుల వాడకాన్ని మార్చాలంటున్నారు.

ధూమపానం, మద్యపానాన్ని పూర్తిగా మానెయ్యాలి. వీటి వల్ల కిడ్నీలతో పాటు ఇతర శరీర భాగాలపైనా చెడు ప్రభావం పడుతుంది. సోడియం అధికంగా ఉండే.. పచ్చళ్లు, చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌ లకు దూరంగా ఉండాలి. వీటివల్ల బరువు పెరగడంతో పాటు కిడ్నీలు అనారోగ్యానికి గురవుతాయని హెచ్చరిస్తున్నారు.

వనస్పతి, వెన్న, పేస్ట్రీస్‌, తీపి పదార్థాలు, చెక్కర, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని మోతాదుకు మించి తీసుకోకూడదంటున్నారు. అస్వస్థతకు గురైతే సొంత వైద్యం చేసుకోకూడదు. చిన్న చిన్న సమస్యలకు కూడా అతిగా మందులు వేసుకుంటే కిడ్నీల జీవితకాలం తగ్గిపోతుంది.

First Published:  15 Feb 2025 12:14 PM IST
Next Story