Telugu Global
Health & Life Style

హ్యాపీనెస్‌ కోసం జపనీస్ ఫాలో అయ్యే హ్యాబిట్స్‌ ఇవే..

ప్రపంచంలోని మిగతా లైఫ్ స్టైల్స్ తో పోలిస్తే.. జపనీస్ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. జపాన్‌లో మనుషుల సగటు జీవితకాలం 86 ఏండ్లు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే హయ్యెస్ట్ యావరేజ్ లైఫ్ స్పాన్. అలాగే అందం, ఆరోగ్యం విషయంలోనూ జపనీయులు అందరికంటే ముందుంటారు.

హ్యాపీనెస్‌ కోసం జపనీస్ ఫాలో అయ్యే హ్యాబిట్స్‌ ఇవే..
X

ప్రపంచంలోని మిగతా లైఫ్ స్టైల్స్ తో పోలిస్తే.. జపనీస్ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. జపాన్‌లో మనుషుల సగటు జీవితకాలం 86 ఏండ్లు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే హయ్యెస్ట్ యావరేజ్ లైఫ్ స్పాన్. అలాగే అందం, ఆరోగ్యం విషయంలోనూ జపనీయులు అందరికంటే ముందుంటారు. జపనీయుల వయసు గుర్తించడం కష్టం. ఐదు పదుల వయసులోనూ అందంగా ఉండడం జపనీయులకే సాధ్యం. ఇంత ప్రత్యేకంగా ఉండేందుకు జపనీయులు ఎలాంటి హ్యాబిట్స్ ఫాలో అవుతారు. జపనీస్ హ్యాపీ లైఫ్‌స్టైల్‌కు సీక్రెట్స్ ఏంటి?

జపనీస్ లైఫ్‌స్టైల్‌లో పరిశుభ్రత, డిసిప్లిన్, డైట్, నేచర్‌‌తో కనెక్షన్.. ఇలా చాలా అంశాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా జపనీయులు తమ పరిసరాలను క్లీన్ గా ఉంచుకుంటారు. ప్రపంచంలోని క్లీనెస్ట్ దేశాల్లో జపాన్ కూడా ఒకటి. పరిసరాలు మాత్రమే కాదు, వ్యక్తిగత శుభ్రతలోనూ జపాన్ ముందుంటుంది. జపనీయుల శుభ్రత ఎలా ఉంటుందంటే.. అక్కడి కరెన్సీ నోట్లు కూడా తళతళ మెరిసిపోతుంటాయి. ఎందుకంటే వాటిని ఎవరూ చేతులతో ముట్టరు. అందుకే వాటికి మురికి పట్టదు. షాప్స్, హోటళ్లలో డబ్బు చేతులు మారదు. ఏ షాపుకెళ్లినా డబ్బు వేయడానికి ఒక ట్రే ఉంటుంది. అందులోనే డబ్బు వేస్తారు. శుభ్రతకు జపనీయులు ఇచ్చే ఇంపార్టెన్స్ అలాంటిది మరి.

డిసిప్లిన్‌లో ఫస్ట్

జపాన్‌లో పిల్లలకు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణను అలవాటు చేస్తారు. చెప్పులు బయట వదిలడం అనేది జపనీస్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యే రూల్. ఇంటికి వెళ్లినా, స్కూల్ కు వెళ్లినా.. చెప్పులు, షూస్ బయటే వదిలి లోపలికి వెళ్తారు. చెప్పులు పెట్టేందుకు ప్రతీ చోట సెపరేట్ గా ర్యాక్స్ ను అమర్చుతారు. అలాగే ఏదైనా పనికి లేదా మీటింగ్ కి వెళ్లేటప్పుడు.. వెళ్లాల్సిన టైం కంటే పది నిముషాలు ముందే వెళ్లడం జపనీస్ కు అలవాటు. లేట్ గా వెళ్లడం అంటే అవతలి వాళ్లను అవమానించడంగా భావిస్తారు వాళ్లు. అందుకే ఏ పనికైనా టైంకి అందుబాటులో ఉంటారు.

డైట్ ఇలా..

జపనీయులు ఎక్కువకాలం బతకడానికి వాళ్లు తీసుకునే ఆహారమే కారణమని చెప్పొచ్చు. జపాన్‌ వాతావరణంలో ఆహారం తొందరగా పాడవుతుంది. అందుకే వాళ్లు స్టోర్ చేసిన ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ తినడానికి అంతగా ఇష్టపడరు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వండిన ఫుడ్ నే తీసుకుంటారు. జపనీయులుమిసో, నాట్టో, సోయా, వంటి పులియబెట్టిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు, డైజెషన్ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే జపాన్ లో గ్రీన్ టీ వాడకం ఎక్కువ. అందుకే వాళ్లకు క్యాన్సర్‌, గుండె జబ్బుల వంటివి తక్కువ.

జపనీస్ ఎక్కువగా సీ ఫుడ్ తీసుకుంటారు. దానివల్ల వాళ్లో ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తక్కువ. ఇక అన్నింటికంటే ముఖ్యంగా జపనీయులు తినేటప్పుడు కడుపు నిండుగా కాకుండా పొట్టలో కాస్త గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. భోజనానికి వాడే ప్లేట్లు కూడా చిన్నవి వాడతారు. అందుకే అక్కడ ఒబెసిటీ అంతగా కనిపించదు.

జపనీయులు తినే ఆహారాన్ని మూడు మీల్స్ గా డివైడ్ చేసుకుంటారు. మొదటి మీల్ లో ప్రొటీన్లు, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటే.. రెండో మీల్ లో చేపలు తప్పనిసరిగా ఉంటాయి. ఇక మూడో మీల్ కూరలు, సలాడ్స్‌ ఉంటాయి. ఈ మూడింటిని తినటం వల్ల వారికి బ్యాలెన్స్‌డ్ డైట్ లభిస్తుంది. దాంతో వాళ్ల స్కిన్ కూడా ఎప్పుడూ తాజాగా ఉంటుంది.

జపాన్‌లో ట్రైన్ లేదా బస్ లాంటివి ఎక్కితే చాలా సైలెంట్‌గా ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో సైలెంట్‌గా ఉండాలన్న రూల్‌ను వాళ్లు పక్కాగా పాటిస్తారు.

జపాన్‌లో ఎవరైనా జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే వాళ్లు తప్పక మాస్క్‌లు పెట్టుకుంటారు. ఇతరులకు ఆ వైరస్, బ్యాక్టీరియా సోకకుండా చూడడం తమ బాధ్యతగా భావిస్తారు.

జపాన్ లో ఎక్కడైనా టికెట్ కౌంటర్ల ముందు ఎంత పొడవైన లైన్ ఉంటే.. గంటల తరబడి వెయిట్ చేస్తారే తప్ప లైన్ తప్పడం అనేది ఉండదు. 2011లో సునామీ, భూకంపం లాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఫుడ్, వాటర్ కోసం జపనీస్ క్యూ పాటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

జపనీయులు రోజువారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం వేళ స్నానం కోసం ప్రత్యేకంగా టైం కేటాయిస్తారు. స్నానాన్ని పూర్తిగా ఆశ్వాదిస్తారు. అది వాళ్ల ప్రాచీన సాంప్రదాయంలో భాగం. చర్మ ఆరోగ్యం కోసం నీళ్లలో కొన్ని హెర్బ్స్ కలుపుతారు. అలా ముప్ఫై నుంచి యాభై నిముషాల పాటు స్నానం చేస్తూ పూర్తిగా రిలాక్స్ అవుతారు.

జపనీస్ రెండు వారాలకొకసారైనా ఫారెస్ట్ బాతింగ్ చేస్తారు. అంటే అడవుల్లో లాంగ్ వాక్ చేయడం. నేచర్‌‌తో గడపడాన్ని వాళ్లు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. దీంతోపాటు రోజూ ఉదయాన్నే తప్పకుండా కొంత వ్యాయామం చేస్తారు. పరుపులకు బదులు నేలపై పడుకోడాన్ని ఇష్టపడతారు. దీనివల్ల వాళ్లకు వెన్ను నొప్పి, నడుము నొప్పి లాంటివి రావు.

అలాగే జపాన్‌లో ‘షింటో’ అనే సంప్రదాయం ఉంటుంది. షింటో అంటే శరీరం, మనసు శుభ్రంగా ఉంచుకోవడం. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మనసు కల్మషం లేకుండా చూసుకోవాలని వాళ్లు నమ్ముతారు.

First Published:  20 Aug 2023 10:00 AM IST
Next Story