Telugu Global
Health & Life Style

చలికాలం వెచ్చగా ఉంచే డైట్ ఇది!

చలికాలంలో క్యాలరీలు కరిగించాలన్నా, బరువు తగ్గాలన్నా.. డైట్ హెల్దీగా ఉంచుకోవడం ముఖ్యం. అలాగే చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు కూడా తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

చలికాలం వెచ్చగా ఉంచే డైట్ ఇది!
X

చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే రక్తప్రసరణ సాఫీగా జరగడం ముఖ్యం. అందుకే విటమిన్స్ , న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకుంటూ జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. చలికాలం డైట్ ఎలా ఉండాలంటే..

స్నాక్స్‌కి బదులు సూప్

వింటర్‌‌లో వేడివేడి సూప్స్ తీసుకుంటే హాయిగా అనిపిస్తుంది. స్నాక్స్, జంక్ ఫుడ్స్ లాంటివాటి వల్ల బరువుతోపాటు బద్ధకం కూడా పెరుగుతుంది. కాబట్టి స్నాక్స్‌ను సూప్స్‌తో రీప్లేస్ చేయాలి.

నో ఆల్కహాల్

చలికాలంలో ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుందనుకుంటారు కొంతమంది. కానీ, అది నిజం కాదు. ఆల్కహాల్ వల్ల క్యాలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఆల్కహాల్ వల్ల డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదమూ ఉంది. కాబట్టి వింటర్‌‌లో ఆల్కహాల్ తగ్గించాలి.

మార్నింగ్ ముఖ్యం..

ఏ డైట్‌లో అయినా మార్నింగ్ తీసుకునే ఫుడ్ కీలకం. ఉదయం మంచి ఆహారం తీసుకుంటే మెటబాలిజం పెరగుతుంది. అందుకే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. ఉదయం ఆహారంలో కార్బోహైడ్రేట్స్ , ప్రొటీనులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడానికి ముందు కొద్దిపాటి వ్యాయామం చేస్తే బాడీ యాక్టివ్ అవుతుంది. శరీరంలో వేడి పెరుగుతుంది.

అల్లం, హనీ

వింటర్‌‌లో తీసుకునే ఆహారాల్లో అల్లం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే.. అల్లం, తేనెతో కలిపిన టీ తీసుకోవడం ద్వారా చలికాలంలో కామన్‌గా వచ్చే జలువు , ఫ్లూ లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. వింటర్‌‌లో రోజూ పొద్దున్నే ఒక కప్పు అల్లం టీ తీసుకోవడం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది. చలిని తట్టుకునేలా ఇమ్యూనిటీని పెరుగుతుంది.

పల్లీలు, బెల్లం

వింటర్‌‌లో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఫుడ్స్‌లో వేరుశెనగ ఒకటి. వేరుశెనగ గుండెకు ఆక్సిజన్ అందే శాతాన్ని పెంచుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అలాగే వింటర్‌‌లో షుగర్‌‌కి బదులు బెల్లం వాడితే మంచిది. జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఉంటాయి. బెల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకూ సాయపడుతుంది.

మిల్లెట్స్

వింటర్‌‌లో తీసుకోవాల్సిన ఫుడ్స్‌లో మిల్లెట్స్ కూడా మంచి ఆప్షన్. మిల్లెట్స్‌తో తక్కువ క్వాంటిటీతో ఎక్కువ పోషకాలు పొందొచ్చు. టిఫిన్, స్నాక్స్ టైంలో మిల్లెట్ వంటలు తీసుకుంటే శరీరం లైట్‌గా ఉంటుంది. ఆకలి తగ్గుతుంది.

ఫ్రూట్స్ విషయంలో..

చలికాలంలో ఫ్రూట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్‌తో ఎలాంటి నష్టం ఉండదు. అయితే తీపి ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తగ్గించాలి. వింటర్‌‌లో వెచ్చదనం కోసం ఆరెంజ్ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు.


First Published:  4 Dec 2023 4:38 PM GMT
Next Story