Telugu Global
Health & Life Style

మందు లైట్‌గా తీసుకున్నా ప్రమాదమే!

ఎంత లైట్‌గా తీసుకున్నప్పటికీ లాంగ్ టర్మ్‌లో ఆల్కహాల్ ఎఫెక్ట్ చూపించక మానదు అని సైంటిస్టులు చెప్తున్నారు.

మందు లైట్‌గా తీసుకున్నా ప్రమాదమే!
X

రోజువారీ అలవాటుగా ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమనీ.. కానీ, అప్పుడప్పుడు లైట్‌గా తీసుకుంటే మంచిదని చాలామంది భావిస్తుంటారు. అయితే ఎంత లైట్‌గా తీసుకున్నా ఆల్కహాల్‌తో నష్టమేనంటున్నారు సైంటిస్టులు. ఆల్కహాల్‌పై తాజాగా జరిపిన ఓ స్టడీలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అవేంటంటే..

ఆల్కహాల్‌ను కొద్దిమొత్తంలో తీసుకుంటే గుండెకు మంచిదని, ఆయుష్షు పెరుగుతుందని గతంలో కొన్ని వాదనలు ఉన్నాయి. చాలామంది ఇది నిజమని కూడా నమ్ముతుంటారు. అయితే అందులో నిజం లేదని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. స్వల్ప మోతాదులో మద్యం తాగినా.. గుండెకు ముప్పు వాటిల్లుతుందని స్పష్టం చేసింది. ఎంత లైట్‌గా తీసుకున్నప్పటికీ లాంగ్ టర్మ్‌లో ఆల్కహాల్ ఎఫెక్ట్ చూపించక మానదు అని సైంటిస్టులు చెప్తున్నారు.

ఆయుష్షుపై ఆల్కహాల్ ఎఫెక్ట్ ఎంత వరకూ ఉంటుదన్న విషయంపై చేసిన ఈ స్టడీలో మద్యం వల్ల ఆయుష్షు తగ్గుతుందని కనుగొన్నారు. కొద్దిమొత్తంలో మద్యం తాగే వాళ్లు, మద్యం తాగడం మానేసిన వ్యక్తులు, అసలు మద్యమే ముట్టని వాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ స్టడీ నిర్వహించారు. వీరిలో మద్యం ముట్టని వారే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నట్టు సైంటిస్టులు వివరించారు. ఆల్కహాల్‌కు సంబంధించి సేఫ్ లిమిట్ అంటూ ఏదీ ఉండదని వాళ్లు అంటున్నారు. కొంత తీసుకున్నా నష్టమే అని స్పష్టం చేశారు.

నష్టాలివే..

ఆల్కహాల్ వల్ల కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల లివర్ పాడవుతుంది. తద్వారా శరీరంలో రకరకాల టాక్సిన్స్ పేరుకుపోయి పలు సమస్యలు మొదలవుతాయి. అలాగే ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ కూడా దెబ్బ తింటుంది.

డ్రింకింగ్ వల్ల క్యాన్సర్, డయాబెటిస్, ఒబెసిటీతో పాటు గుండె జబ్బులు కూడా పెరుగుతాయి. హార్ట్ స్ట్రోక్ రిస్క్ కూడా పెరుగుతుంది.

మద్యపానం వల్ల ఎముకల బలహీనంగా తయారవుతాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. యూరినరీ ప్రాబ్లమ్స్, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

First Published:  27 July 2024 4:57 PM IST
Next Story