Telugu Global
Health & Life Style

లిక్విడ్ డైట్ ఎంతవరకూ మంచిది?

ఈజీగా బరువు తగ్గడం కోసం చాలామంది కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకునే లిక్విడ్ డైట్‌ ఫాలో అవుతుంటారు.

Liquid Diet: లిక్విడ్ డైట్ ఎంతవరకూ మంచిది?
X

Liquid Diet: లిక్విడ్ డైట్ ఎంతవరకూ మంచిది?

ఈజీగా బరువు తగ్గడం కోసం చాలామంది కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకునే లిక్విడ్ డైట్‌ ఫాలో అవుతుంటారు. అయితే ఇలా కేవలం ద్రవపదార్ధాలు మాత్రమే తీసుకోవడం వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయంటున్నారు డాక్టర్లు.

లిక్విడ్ డైట్‌లో అంటే కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అంటే కూరగాయల జ్యూస్, పండ్లు, పండ్ల రసాలు, జావలు, సూప్స్.. ఇలా రకరకాల ద్రవపదార్థాలు తీసుకోవచ్చు. త్వరగా బరువు తగ్గడం కోసం లిక్విడ్ డైట్ బెస్ట్ ఆప్షన్. ఈ డైట్‌తో శరీరానికి అన్నిరకాల విటమిన్లు, మినరల్స్ అందుతాయి. శరీరం నుంచి టాక్సిన్స్ అన్నీ బయటకొస్తాయి. లిక్విడ్ డైట్ ద్వారా పొట్ట తేలికగా అనిపిస్తుంది. డైజెషన్ ఈజీగా ఉంటుంది.

ఇకపోతే లిక్విడ్ డైట్‌తో కొంత నష్టం కూడా లేకపోలేదు. ఈ డైట్‌ను ఎక్కువకాలం కంటిన్యూ చేయడం కష్టం. లిక్విడ్ డైట్ ఎక్కువ కాలం తీసుకుంటే.. శరీరానికి కేలరీలు తగ్గుతాయి. మెటబాలిజం నెమ్మదిస్తుంది. లిక్విడ్ డైట్ వల్ల కొంతమందిలో అలసట, ఆకలి, బలహీనత, తల తిరగడం, జుట్టు రాలడం వంటి సమస్యలు రావొచ్చు. లిక్విడ్ డైట్ ఫాలో అయ్యేవాళ్లలకు సరిపడా ప్రొటీన్స్ అందే అవకాశం తక్కువ. కాబట్టి ఈ డైట్ ఫాలో అయ్యేవాళ్లు శరీరానికి ప్రొటీన్స్ కూడా అందేలా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ప్రొటీన్ డెఫీషియన్సీ వచ్చే ప్రమాదముంది. ఈ డైట్ అందరికీ సూట్ కాకపోవచ్చు. కాబట్టి లిక్విడ్ డైట్ పాటించే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

First Published:  10 July 2023 8:56 AM IST
Next Story