Telugu Global
Health & Life Style

తరచూ షుగర్ లెవల్స్ పడిపోతున్నాయా? ఇది తెలుసుకోండి!

ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ ఉన్నవాళ్లకు రక్తంలో షుగరల్ లెవల్స్ బాగా పడిపోవడం ద్వారా హైపోగ్లైసీమియా అనే పరిస్థితి సంభవిస్తుంది.

తరచూ షుగర్ లెవల్స్ పడిపోతున్నాయా? ఇది తెలుసుకోండి!
X

డయాబెటిస్ ఉన్నవాళ్లు షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోకపోతే కొన్ని కొత్త సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ ఉన్నవాళ్లకు రక్తంలో షుగరల్ లెవల్స్ బాగా పడిపోవడం ద్వారా హైపోగ్లైసీమియా అనే పరిస్థితి సంభవిస్తుంది. ఇదెలా ఉంటుందంటే..

తక్కువ బ్లడ్ షుగర్ ఉన్నవారికి హైపోగ్లైసీమియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పలు తీవ్రమైన సమస్యలతోపాటు కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా కావొచ్చు. అందుకే ఈ పరిస్థితి పట్ల కొంత అవగాహన పెంచుకోవడం అవసరం.

లక్షణాలు ఇలా..

ఈ మధ్య కాలంలో డయాబెటిక్ పేషెంట్లలో హైపోగ్లైసీమియా సమస్య ఎక్కువగా కనిపిస్తోందని డాక్టర్లు చెప్తున్నారు. సమయానికి మందులు తీసుకోకపోవడం, డయాబెటిస్ తర్వాత లైఫ్‌స్టైల్‌ను మార్చుకోకపోవడం వల్ల హైపోగ్లైసీమియా వస్తుంది. శరీరంలో షుగర్ లెవల్స్ ఎప్పుడూ 70 ఎంజీ కంటే తక్కువగా ఉంటుంటే అది హైపోగ్లైసీమియా లక్షణం కావచ్చు. లోబ్లడ్ షుగర్ వల్ల అకస్మాత్తుగా చెమట పట్టడం, హార్ట్ రేట్ పెరగడం, యాంగ్జయిటీ, భయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి ఇంకా ముదిరితే మైకం, తలనొప్పి, చర్మం పాలిపోవడం, వణుకు, చలి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.

జాగ్రత్తలు ఇలా..

డయాబెటిస్ ఉందని తెలిసి కూడా సరైన కేర్ తీసుకోకపోవడం, ఆహారాన్ని బాగా తగ్గించడం, మద్యపానం, స్మోకింగ్ వంటి అలవాట్ల వల్ల హైపోగ్లైసీమియా తలెత్తొచ్చు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు తగిన మందులు వాడుతూ ఫైబర్, ప్రొటీన్స్ ఉండే హెల్దీ డైట్ పాటించాలి. పస్తులుండకూడదు. డ్రై ఫ్రూట్స్ వంటివి ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. అలాగే గ్లూకోమీటర్‌తో తరచూ షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటుండాలి.

First Published:  11 Aug 2024 1:00 PM IST
Next Story