Telugu Global
Health & Life Style

సన్‌స్క్రీన్ లోషన్ ఇలా వాడండి

ఎండకాలంలో చర్మ సంరక్షణ కోసం సన్‌స్క్రీన్ను వాడటం తప్పని సరి. సాధారణంగా యూవీ కిరణాల వల్ల చర్మంపై మచ్చలు, ముడతలు ఏర్పడుతుంటాయి. ఎక్కువ సేపు ఎండలో ఉండడం వల్ల చర్మం టాన్ అవ్వడమే కాకుండా తీవ్రమైన చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.

సన్‌స్క్రీన్ లోషన్ ఇలా వాడండి
X

ఎండకాలంలో చర్మ సంరక్షణ కోసం సన్‌స్క్రీన్ను వాడటం తప్పని సరి. సాధారణంగా యూవీ కిరణాల వల్ల చర్మంపై మచ్చలు, ముడతలు ఏర్పడుతుంటాయి. ఎక్కువ సేపు ఎండలో ఉండడం వల్ల చర్మం టాన్ అవ్వడమే కాకుండా తీవ్రమైన చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. యూవీ కిరణాల హానికరమైన ప్రభావం నుంచి చర్మాన్ని రక్షించడంలో సన్ స్క్రీన్ లోషన్ బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా రొటీన్ కేర్ లాగ దీనిని ఉపయోగిస్తూ ఉండాలి. అయితే ఇంట్లో ఉన్నా కూడా అప్లై చేయాలా లేదా బయటికి వెళ్లినప్పుడు మాత్రమే అప్లై చేయాలా..? అన్న సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. అంతే కాదు సన్‌ స్క్రీన్‌ లోషన్‌ వాడడం వల్ల విటమిన్‌ డి లోపం వస్తుందని ప్రచారం లో ఉన్న నేపధ్యం లో సన్‌ స్క్రీన్‌ లోషన్ లు ఎలా వాడాలి, అసలు వాడాలా వద్దా అనేది ఇప్పుడు చూద్దాం.

మానవ శరీరానికి విటమిన్ డి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. సూర్యరశ్మికి బహిర్గతం అయిన తర్వాత ఇది శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. విటమిన్ D ఎముక పెరుగుదల, జీవక్రియ ప్రక్రియలో ఒక స్టెరాయిడ్ హార్మోన్ గా ఉపయోగపడుతుంది. అయితే సన్‌లోషన్‌ వాడడం వల్ల విటమిన్‌ డీ లోపం వస్తుందన్న వాదన చాలాకాలంగా జరుగుతూనే ఉంది. కానీ ఇది నిజం కాదు

ఎండ పడిన తరువాత శరీరంలో ఏం జరుగుతుందంటే..

మనం సూర్యుని అతినీలలోహిత B రేడియేషన్ (UVB)కి గురైనప్పుడు, మన చర్మ కణాలలో కొన్ని ప్రక్రియలు జరిగి కొలెస్ట్రాల్ లాంటి అణువును విటమిన్ D3గా మారుస్తుంది. అంటే విటమిన్ డి ఉత్పత్తికి UVB రేడియేషన్‌కు గురికావడం అనేది అవసరం. అయితే ఇది చాలా పరిమితంగా ఉండాలి. అందుకు సన్‌స్క్రీన్ ఒక ఫిల్టర్‌గా పనిచేస్తుంది, సన్ స్క్రీన్ లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPF) ఎంత ఎక్కువగా ఉంటే, సన్‌బర్న్‌ను నివారించడంలో అది అంమెరుగ్గా పనిచేస్తుంది. అంతే కాదు సన్ స్క్రీన్ రెడీయేషన్ ను ఆపి చర్మ కాన్సర్ ప్రభావం కూడా తగ్గిస్తుంది.

రోజులో ఎన్నిసార్లు..

నిపుణులు చెప్పిన దాని ప్రకారం సన్ స్క్రీన్ లోషన్ రాసి మళ్ళీ రెండు గంటల తర్వాత తిరిగి మళ్ళీ రాయాలి . ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ మీరు బయటికి వెళ్లక పోయినా కూడా ఈ పద్ధతిని తప్పక అనుసరించాలి. మరీ 2 గంటలకు ఒకసారి కాకపోయినా సన్ స్క్రీన్ తప్పక అప్లయ్ చేయాలి.

First Published:  20 May 2024 8:00 AM IST
Next Story