Telugu Global
Health & Life Style

చెమట పొక్కులకు చెక్ పెట్టండిలా...

వేసవిలో చెమటను భరించడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది చాలామందికి చెమటతో పాటు పొక్కులు కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి.

చెమట పొక్కులకు చెక్ పెట్టండిలా...
X

వేసవిలో చెమటను భరించడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది చాలామందికి చెమటతో పాటు పొక్కులు కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. చర్మం ఎర్రగా మారి భరించలేని దురద పెడుతుంది. అయితే సమ్మర్‌‌లో వచ్చే ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు. అదెలాగంటే..

సమ్మర్‌‌లో చెమట పట్టకూడదంటే వదులుగా ఉండే కాటన్ లేదా లెనిన్ బట్టలు వేసుకోవాలి. చెమటను పీల్చే బట్టలు వేసుకోవడం ద్వారా చెమటపొక్కుల బాధను తగ్గించొచ్చు.

సమ్మర్‌‌లో ఎక్కువగా నీళ్లు తాగడం.. అలాగే చేతులు, కాళ్లు, ముఖాన్ని తరచూ కడుక్కోవడం వల్ల చెమట పొక్కులు రాకుండా చూసుకోవచ్చు.

చెమట పొక్కులతో ఇబ్బంది పడుతున్నవాళ్లు క్లాత్‌లో ఐస్‌క్యూబ్స్‌ పెట్టి మంటగా ఉన్నచోట 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచాలి. ఇలా ప్రతి నాలుగు గంటలకోసారి చేస్తూ ఉంటే చెమట పొక్కులు తగ్గిపోతాయి.

చెమట పొక్కులు వచ్చిన ప్రాంతంలో కలబంద గుజ్జు రాసినా ఫలితం ఉంటుంది. కలబంద శరీరంలో వేడిని బయటకు పంపి చల్లదనాన్నిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.

వైట్‌ వెనిగర్‌లో మెత్తటి వస్త్రం లేదా టిష్యూ కాగితాన్ని ముంచి చెమట పొక్కుల మీద ఉంచాలి. ఇలా చేయడం వల్ల పొక్కులు తగ్గడంతో పాటు చర్మానికి హాయిగా అనిపిస్తుంది.

ముల్తాని మట్టికి రోజ్‌వాటర్‌ చేర్చి పేస్ట్‌లా చేసి.. దాన్ని చెమట పొక్కుల మీద అప్లై చేసి ఆరాక చల్లని నీళ్లతో కడిగేస్తే.. పొక్కులు తగ్గిపోతాయి.

లేత వేప ఆకుల్ని మెత్తగా నూరి పొక్కులపై అప్లై చేసి ఆరాక చల్లని నీటితో కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. పుచ్చకాయ గుజ్జుని కూడా వాడుకోవచ్చు.

సమ్మర్‌‌లో రోజుకో గ్లాసు చెరకు రసం లేదా నిమ్మరసం తాగితే చెమట పొక్కులు రాకుండా ఉంటాయి. అలాగే సమ్మర్‌‌లో రోజుకి మూడు సార్లు స్నానం చేస్తే చెమట పొక్కుల బెడద తగ్గుతుంది.

First Published:  5 May 2023 5:04 PM IST
Next Story