అతిగా ఆలోచిస్తున్నారా? ఇలా చేసి చూడండి!
సమస్యల కంటే వాటి గురించి అతిగా ఆలోచించడమే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. అతిగా ఆలోచించడం అనేది అన్ని సమస్యల్లోకెల్లా పెద్ద సమస్య.

సమస్యల కంటే వాటి గురించి అతిగా ఆలోచించడమే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. అతిగా ఆలోచించడం అనేది అన్ని సమస్యల్లోకెల్లా పెద్ద సమస్య. దీనివల్ల సమస్యలకు సొల్యూషన్ దొరక్కపోగా డిప్రెషన్, యాంగ్జయిటీ మరింత పెరుగుతాయి. మరి దీనికి చెక్ పెట్టేదెలా?
ప్రతి నలుగురిలో ఒకరికి అతిగా ఆలోచించే అలవాటు ఉంటుందని స్టడీలు చెప్తున్నాయి. ఈ అలవాటు వల్ల మానసిక ఆనందం కోల్పోవడమే కాకుండా కొత్త సమస్యలు వచ్చి చేరతాయి. చాలామందిలో ఒత్తిడి, ఆందోళనలు పెరగడానికి ఓవర్ థింకింగ్ కారణంగా ఉంటోంది. దీన్ని తగ్గించుకోవడం కోసం కొన్ని అలవాట్లు అలవరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.
మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేస్తున్న విషయాలను పేపర్‌పై పెట్టాలి. అసలు మీ సమస్య ఏంటి? దానికున్న పాజిబుల్ సొల్యూషన్స్ ఏవి? సమస్య వల్ల మీ ఎమోషన్స్ ఎలా మారుతున్నాయి? ఇలా ప్రతిసారీ ఈ మూడు విషయాలను పేపర్‌పై రాస్తుండడం ద్వారా క్రమంగా ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ వంటివి పెరగకుండా ఉంటాయి.
మీరు అతిగా ఆలోచించే సందర్భాలు, సమయాలను గుర్తించాలి. ఎయే రోజుల్లో ఆలోచనలు వేధిస్తున్నాయి? ఏయే సమయాల్లో అలా జరుగుతుందో గుర్తిస్తే.. ఓవర్ థింకింగ్‌ను ట్రిగ్గర్ చేసే ఇతర ఫ్యాక్టర్స్‌పై మీకు అవగాహన కలుగుతుంది. ఉదాహరణకు ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో రిలాక్స్ అయినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తుంటే ఆయా సమయాలను ఇతర పనులతో గడపొచ్చు. ఒకవేళ ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు లేదా ఆఫీసులో ఉన్నప్పుడు వస్తుంటే ఆయా పరిస్థితులను మార్చే ప్రయత్నం చేయొచ్చు.
మీ ఆలోచనలకు మీరే కారణం అన్న సంగతి తెలుసుకోవాలి. మీ సమస్యలకు ఇతరులు కారణం.. అని భావించినంతకాలం కోపం, యాంగ్జయిటీ వంటివి పెరుగుతాయే గానీ తగ్గవు. కాబట్టి మీ ఆలోచనలను మీకు నచ్చినట్టుగా మలచుకోవడం మీ చేతుల్లోనే ఉందని తెలుసుకోవాలి. ఇతరుల కంటే మీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకోవాలి.
అతిగా ఆలోచించడం ఒక అలవాటుగా మారినవాళ్లు దానికంటూ కొంత సమయం కేటాయిస్తే.. క్రమంగా ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. ప్రతిరోజూ పావుగంటసేపు ఆలోచించడానికి టైం కేటాయించాలి. ఆ టైంలో మీకుండే భయాలు, అనుమాల గురించి ఆలోచించాలి. సమయం అయిపోగానే వేరే పనిలోకి షిఫ్ట్ అవ్వాలి. ఫన్నీగా అనిపించినా.. ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక వీటితోపాటు ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్ చేయడం అప్పుడప్పుడు ప్రయణాలు చేయడం, ఆటలు ఆడటం ద్వారా మనసు ఉత్తేజితమవుతుంది. నెగెటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఓవర్ థింకింగ్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిన వాళ్లు, ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నవాళ్లు ఒకసారి సైకాలజిస్ట్‌ని కలిస్తే కొంత ఫలితం ఉంటుంది.