Telugu Global
Health & Life Style

సమ్మర్‌‌లో జిడ్డు చర్మం వేధిస్తోందా? ఇలా చేసి చూడండి!

సమ్మర్‌‌లో చాలామందికి చర్మం జిడ్డుగా మారుతుంటుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. మరి దీనికి చెక్ పెట్టేదెలా?

సమ్మర్‌‌లో జిడ్డు చర్మం వేధిస్తోందా? ఇలా చేసి చూడండి!
X

సమ్మర్‌‌లో చాలామందికి చర్మం జిడ్డుగా మారుతుంటుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. మరి దీనికి చెక్ పెట్టేదెలా?

సమ్మర్‌‌లో ఉండే వేడి కారణంగా చర్మ రంధ్రాలు వదులై చర్మంలోని సెబమ్ అనే సహజమైన నూనె బయటకు వస్తుంటుంది. ఈ కారణంగా సమ్మర్‌‌లో ఆయిల్ స్కిన్ సమస్య పెరుగుతుంటుంది. ఒకపక్క చెమట, మరోపక్క జిడ్డుతో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్ని తగ్గించుకునేందుకు కొన్ని సింపుల్ టిప్స్ పాటించొచ్చు. అవేంటంటే..

సమ్మర్‌‌లో చర్మంపై జిడ్డుని తొలగించుకునేందుకు తరచూ ఫేస్‌వాష్ చేసుకుంటూ ఉండాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు వెంట బ్లాటింగ్ పేపర్స్‌ వంటివి తీసుకెళ్తే.. జిడ్డుగా అనిపించినప్పుడల్లా వాటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవచ్చు.

ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు సమ్మర్‌‌లో సన్ స్క్రీన్ లోషన్ తప్పక వాడాలి. లేదంటే జిడ్డు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే బయటి నుంచి వచ్చిన తర్వాత ముఖాన్ని క్లెన్సింగ్ మిల్క్‌తో క్లీన్ చేసుకుంటే చర్మం త్వరగా రీఫ్రెష్ అవుతుంది.

జిడ్డు చర్మం సమస్య ఉన్నవాళ్లు సమ్మర్‌‌లో ఆయిల్ బేస్డ్ మేకప్ ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉండాలి. వీలైనంత వరకూ నేచురల్, డ్రై ప్రొడక్ట్స్ వాడాలి. అలాగే ఆయిల్ స్కిన్ వల్ల మేకప్ త్వరగా పాడవుతుంది. కాబట్టి తక్కువ మేకప్ వేసుకునే ప్రయత్నం చేయాలి.

ఆయిల్ స్కిన్‌ను పోగొట్టడంలో ముల్తానీ మట్టి బాగా పనికొస్తుంది. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్‌లో కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవచ్చు. వారానికి రెండు మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే జిడ్డు చర్మం తగ్గుతుంది.

పెరుగు చర్మంలోని నూనెలను అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా కూడా ఆయిల్ స్కిన్ నుంచి బయటపడొచ్చు. ఈ ప్యా్క్‌ను రెండు రోజులకోసారి వేసుకోవచ్చు. ప్యాక్ వేసి పది నిముషాల తర్వాత చల్లటినీటితో కడిగేయాలి.

కీరాదోస గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే జిడ్డు చర్మం కంట్రోల్ అవుతుంది. ఈ ప్యాక్ వేసుకుని 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

ఇవి కూడా..

జిడ్డు చర్మం తగ్గాలంటే నూనె పదార్థాలు, కారం, మసాలాలు తినడం తగ్గించాలి. వీలైనంత వరకూ తాజా పండ్లు, కూరగాయలు తింటే చర్మం యవ్వనంగా ఉంటుంది. అలాగే సమ్మర్‌‌లో బయటి నుంచి వచ్చిన ప్రతీసారీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

సమ్మర్‌‌లో దుమ్ము, పొగ నుంచి ముఖాన్ని కాపాడుకోవాలి. లేకపొతే చర్మం మరింత త్వరగా ట్యాన్ అవుతుంది.

First Published:  23 May 2024 1:00 AM GMT
Next Story