టైప్ 2 డయాబెటిస్.. జాగ్రత్తలు ఇలా..
ప్రస్తుతం ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. అందులోనూ టైప్ 1 డయాబెటిస్ తో పోలిస్తే.. టైప్ 2 డయాబెటిస్ మరింత ప్రమాదమైంది.
ప్రస్తుతం ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. అందులోనూ టైప్ 1 డయాబెటిస్ తో పోలిస్తే.. టైప్ 2 డయాబెటిస్ మరింత ప్రమాదమైంది. దీన్ని అదుపులో ఉంచడం కోసం కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఇప్పుడు చూద్దాం.
టైప్1 డయాబెటిస్‌లో శరీరం ఇన్సులిన్‌ను తయారు చేయదు. అయితే టైప్ 2 డయాబెటిస్‌లో శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించదు. ఈ తరహా సమస్య వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. నోరు తడి ఆరిపోవడం, తరచూ మూత్రం రావడం, చూపు మసకబారడం, బరువు తగ్గడం, గాయాలు మానకపోవడం వంటివి ఇందులో ప్రధాన లక్షణాలు. దీన్ని ఎలా అదుపుచేయొచ్చంటే..
దాల్చిన చెక్క వాడడం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతిరోజూ దాల్చిన చెక్క నానబెట్టిన నీళ్లు తాగడం లేదా దాల్చిన చెక్కతో చేసిన టీ తాగడం ద్వారా కొంత ఉపయోగం ఉంటుంది.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో షుగర్ లెవల్స్ తక్కువగా ఉండడం చేత గ్లూకోజ్ అదుపు తప్పే అవకాశం ఉండదు.
కాకరగాయ తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను కంట్రోల్ చేయొచ్చు. ఇందులో ఉండే విటమిన్ ‘ఎ’, ‘సి’, యాంటీ ఆక్సిడెంట్లు.. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి.
ప్రతిరోజూ ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా కొద్దిరోజుల్లోనే ఇమ్యూనిటీ పెరిగి రక్తంలో ఇన్సూలెన్ లెవల్స్ సరిగ్గా ఉంటాయి. తద్వారా షుగర్ లెవల్స్ అదుపు తప్పకుండా చూసుకోవచ్చు.
చియా గింజలు, బీన్స్, బఠానీల వంటి గింజల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి ఇవి షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. వీటిలో ఉండే ప్రొటీన్ కంటెంట్ వల్ల ఆకలి కూడా తగ్గుతుంది.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లకు మునగాకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్.. ఓవరాల్ ఇమ్యూనిటీని పెంచడంతో పాటు శరీరంలోని గ్లైసమిక్ పదార్థాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. తద్వారా షుగర్ లెవసల్స్ ఎప్పుడూ అదుపులో ఉంటాయి.
వీటితోపాటు సిట్రస్ ఫ్రూట్స్, మెంతులు, ఆకుకూరల వంటివి కూడా డైట్‌లో చేర్చుకుంటే టైప్ 2 డయాబెటిస్ ముప్పుని తగ్గించుకోవచ్చు. అలాగే రోజుకు 20 నిముషాలు వ్యాయామం చేయడం, అధిక బరువు ఉన్నవాళ్లు కనీసం 7 శాతం బరువు తగ్గించుకోవడం, కొవ్వు పదార్థాలు తగ్గించడం వంటివి కూడా డయాబెటిస్‌ను తగ్గిస్తాయి.