బరువు తగ్గడం కోసం చాట్‌జీపీటీ చెప్పిన డైట్ ప్లాన్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అడిగిన ప్రతీ విషయానికి సమాధానం చెప్పే చాట్‌జీపీటీ.. లెటెస్ట్‌గా ఒక యూజర్‌కు సరికొత్త డైట్ ప్లాన్‌ను సూచించింది. ఆ డైట్ ప్లాన్‌తో సదరు యూజర్.. 11 కేజీలు తగ్గినట్టు పోస్ట్ చేశాడు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అడిగిన ప్రతీ విషయానికి సమాధానం చెప్పే చాట్‌జీపీటీ.. లెటెస్ట్‌గా ఒక యూజర్‌కు సరికొత్త డైట్ ప్లాన్‌ను సూచించింది. ఆ డైట్ ప్లాన్‌తో సదరు యూజర్.. 11 కేజీలు తగ్గినట్టు పోస్ట్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే..
బరువు తగ్గడం కోసం చాలామంది డైటీషియన్లను, న్యూట్రిషనిస్టులను సంప్రదిస్తుంటారు. కానీ అమెరికాలోని గ్రెగ్ ముస్కెన్ అనే వ్యక్తి బరువు తగ్గడం కోసం చాట్‌జీపీటీని సలహా అడిగాడు. అది ఇచ్చిన డైట్ ప్లాన్‌తో ఏకంగా 11 కేజీలు తగ్గాడు. ఒబెసిటీతో బాధపడుతున్న గ్రెగ్.. వాకింగ్, రన్నింగ్ లాంటి వ్యాయామాలు కూడా చేయలేకపోతున్నాడట. దీంతో చాట్‌జీపీటీకి తన పరిస్థితి చెప్పి సలహా ఇవ్వమన్నాడు. చాట్‌జీపీటీ ఇచ్చిన సూచనల సాయంతో హెల్తీ డైట్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు. చాట్‌జీపీటీ చెప్పిన డైట్ ప్లాట్ మూడు నెలలు పాటించిన తర్వాత కాస్త యాక్టివ్‌గా మారాడు. దాంతో వారానికి ఆరు రోజులు రన్నింగ్ చేయగలిగాడు. అలా మరిన్ని వర్కవుట్‌లపై ఆసక్తి పెంచుకున్నాడు. అలా మూడు నెలలు తిరిగే సరికి 11 కేజీల బరువు తగ్గాడట. చాట్‌జీపీటీ ఇచ్చిన డైట్ ప్లాన్‌ను గ్రెగ్ ముస్కెన్ మొదట్లో నమ్మలేదట. కానీ ఆ ప్లాన్ చాలా ఈజీగా ఉంటడంతో ఫాలో అయ్యానని చెప్తున్నాడు.
గ్రెగ్ ఇచ్చిన సూచనలను బట్టి చాట్‌జీపీటీ అతనికి తేలికపాటి ఆహారం తీసుకోవడం, రన్నింగ్ షూస్‌ను ఫ్రంట్ డోర్‌కి దగ్గరగా పెట్టుకోవడం వంటి చిన్నచిన్న సలహాలను ఇచ్చింది. అలా గ్రెగ్.. కొద్దికొద్దిగా నడవడం, రన్నింగ్ చేయడం ప్రారంభించాడు. చిన్నగా మొదలుపెట్టి.. రోజురోజుకు వర్కవుట్లు పెంచుకుంటూ పోయాడు. అలా చిన్న చిన్న మార్పులతోనే ఎక్కువ బరువు తగ్గాడు. అయితే అందరికీ ఒకేరకమైన డైట్, వ్యాయామాలు సూట్ అవ్వవు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు డాక్టర్ సలహా తీసుకోవడం కూడా ముఖ్యమే.