Telugu Global
Health & Life Style

గ్యాస్‌ను పోగొట్టే జల్ జీరా డ్రింక్! ఎలా చేయాలంటే..

సమ్మర్‌‌లో జీలకర్ర, నిమ్మరసం, అల్లంతో చేసే జల్ జీరా డ్రింక్ తాగడం వల్ల కడుపులో ఎలాంటి అసౌకర్యం ఉన్నా ఇట్టే క్లియర్ చేసేయొచ్చు.

గ్యాస్‌ను పోగొట్టే జల్ జీరా డ్రింక్! ఎలా చేయాలంటే..
X

గ్యాస్‌ను పోగొట్టే జల్ జీరా డ్రింక్! ఎలా చేయాలంటే..

పొట్ట ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలకు జీలకర్ర మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. సమ్మర్‌‌లో జీలకర్ర, నిమ్మరసం, అల్లంతో చేసే జల్ జీరా డ్రింక్ తాగడం వల్ల కడుపులో ఎలాంటి అసౌకర్యం ఉన్నా ఇట్టే క్లియర్ చేసేయొచ్చు. దీన్ని ఎలా తయారుచేయాలంటే..

జల్ జీరా తయారుచేయడం కోసం ముందుగా జీలకర్రను మంచి వాసనవచ్చేవరకు వేగించి పొడి చేసుకోవాలి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు, నల్ల ఉప్పు, ఇంగువ వేసి మరోసారి పొడి చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమానికి పుదీనా ఆకులు, అల్లం తరుగు, చింతపండు గుజ్జు కలిపి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్లాసు నీటిలో జీలకర్ర మిశ్రమాన్ని వేసి, అందులో నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేస్తే జల్ జీరా రెడీ.

జల్ జీరా డ్రింక్ తాగితే.. కడుపునొప్పి, ఎసిడిటీ, అజీర్ణం లాంటి సమస్యలన్నీ తగ్గుతాయి. మహిళలకు పీరియడ్స్ టైమ్‌లో వచ్చే కడుపు నొప్పిని తగ్గించడానికి జల్ జీరా డ్రింక్ పనికొస్తుంది. జల్ జీరా డ్రింక్‌లో ఉండే పోషకాల వల్ల మహిళల్లో రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. మల బద్ధకం, అజీర్తి లాంటి సమస్యలున్నప్పుడు జల్ జీరాను చల్లని నీటితో కాకుండా వేడి నీటితో తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.

First Published:  3 Jun 2023 10:58 PM IST
Next Story