సమ్మర్‌లో కూల్ లెమనేడ్స్.. తయారీ ఇలా..
సమ్మర్‌లో చల్లని లెమనేడ్స్ చేసుకుని తాగితే శరీరానికి హాయిగా అనిపించడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
సమ్మర్‌లో చల్లని లెమనేడ్స్ చేసుకుని తాగితే శరీరానికి హాయిగా అనిపించడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంట్లోనే సింపుల్‌గా లెమనేడ్స్ ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాం.
స్ట్రాబెరీ లెమనేడ్
కావల్సినవి: స్ట్రాబెర్రీ పండ్లు(కప్పు), తేనే(పావు కప్పు), నిమ్మరసం(అరకప్పు) , నీళ్లు(రెండు కప్పులు), ఐస్ ముక్కలు(నాలుగు), చిన్నగా తరిగిన స్ట్రాబెర్రీ ముక్కలు, పొదీనా ఆకులు.
తయారీ: స్ట్రాబెర్రీ పండ్లు, తేనె మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసులో స్ట్రాబెర్రీ పేస్ట్, నిమ్మరసం , నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత అందులో ఐస్ ముక్కలు వేసి, పైన స్ట్రాబెరీ ముక్కలు, పుదీనా వేస్తే స్ట్రాబెరీ లెమనేడ్ రెడీ.
కివి మింట్ లెమనేడ్
కావల్సినవి: కివి పండ్లు(2), నిమ్మరసం-(రెండు టేబుల్ స్పూన్లు), పుదీనా ఆకులు(కొన్ని), చక్కెర(నాలుగు టేబుల్ స్పూన్లు), నీళ్లు, సోడా.
తయారీ: జార్ లో కొద్దిగా నీళ్లు పోసి కివి పండ్ల ముక్కలు, చక్కెర వేసి మిక్సీ పట్టాలి. తర్వాత దాన్ని మరో జార్‌లో పోసి నిమ్మరసం, తరిగిన పుదీనా ఆకులు, నీళ్లు, కొద్దిగా సోడా పోసి బాగా కలపి, ఐస్‌క్యూబ్స్ వేస్తే కివి మింట్ లెమనేడ్ రెడీ.