Telugu Global
Health & Life Style

సిల్కీ హెయిర్ కావాలా? ఇలా చేసి చూడండి!

మృదువైన సిల్కీ హెయిర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొంతమంది ఇలాంటి జుట్టు కోసం స్పెషల్ ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో జుట్టుని సిల్కీగా మార్చుకోవచ్చు

సిల్కీ హెయిర్ కావాలా? ఇలా చేసి చూడండి!
X

మృదువైన సిల్కీ హెయిర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొంతమంది ఇలాంటి జుట్టు కోసం స్పెషల్ ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో జుట్టుని సిల్కీగా మార్చుకోవచ్చు. అదెలాగంటే..

పుట్టుకతో రింగుల జుట్టు ఉన్నవాళ్లు సిల్కీ హెయిర్ పొందడం కష్టం. ఇలాంటి వాళ్లు స్ట్రెయిటెనింగ్ పద్ధతులను వాడాల్సి ఉంటుంది. ఇక నార్మల్ జుట్టు ఉన్నవాళ్లు జుట్టుని పలుచగా, సిల్కీగా మార్చుకునేందుకు కొన్ని హెయిర్ కేర్ టిప్స్‌ను పాటించాలి.

జుట్టు మృదువుగా తయారవ్వాలంటే జుట్టుకి షాంపూతో పాటు కండిషనర్ కూడా అప్లై చేయాలి. కండీషనర్‌‌తో తలస్నానం చేశాక జుట్టుకి ఆయిల్ అప్లై చేసి చిక్కు పడకుండా చక్కగా దువ్వుకోవాలి. ఆ తర్వాత హైడ్రేటింగ్ సీరమ్ లేదా యాంటీ ఫ్రిజ్ సీరమ్ వంటివి అప్లై చేసి జుట్టుని డ్రయ్యర్ సాయంతో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వెడల్పాటి బ్రష్‌తో జుట్టుని చిక్కు లేకుండా మరోసారి దువ్వుకోవాలి. వెంట్రుకలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటేనే సిల్కీ హెయిర్ లుక్ వస్తుంది. ఈ రొటీన్ ఫాలో అవ్వడం ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పడు సిల్కీ హెయిర్ లుక్ పొందొచ్చు.

ఇక సిల్కీ హెయిర్‌‌ను మెయింటెయిన్ చేయడం కోసం జుట్టుకి సరైన పోషణ అందించడం కూడా ముఖ్యమే. దీనీకోసం వారానికి రెండు సార్లు జుట్టుకి ప్యాక్ వేయాలి. గుడ్డు సొన, తేనె నిమ్మరసం మిక్స్, పెరుగు, మందార ఆకుల పేస్ట్‌.. వీటిలో ఏదో ఒకదానితో హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇలా ప్యాక్ వేసుకోవడం ద్వారా వెంట్రుకలు మరింత స్మూత్‌గా తయారవుతాయి.

సిల్కీ హెయిర్ కావాలనుకునేవాళ్లు జుట్టు రాలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడాలి. దీనికోసం జుట్టుకి లోపలి నుంచి పోషణ ఇవ్వాలి. ఆకుకూరలు, నట్స్ వంటివి ఎక్కువగా తినాలి. జుట్టుని పొల్యూషన్‌కు ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలి.

First Published:  20 Jun 2024 6:30 AM IST
Next Story