Telugu Global
Health & Life Style

ఏది స్వచ్ఛమైన నెయ్యి.. ఎలా తెలుసుకోవాలి?

నెయ్యి నాణ్యతను తెలుసుకోవడానికి చిట్కాలివే

ఏది స్వచ్ఛమైన నెయ్యి.. ఎలా తెలుసుకోవాలి?
X

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో నాణ్యత లేదనే ఆరోపణలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఉలిక్కిపడ్డారు. శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యినే కల్తీ చేస్తే రోజూవారి ఆహారంలో భాగంగా ఉపయోగించే నెయ్యి నాణ్యమైనదేనా అని సందేహిస్తున్నారు. ఆరోగ్యం కోసం ఉపయోగించే నెయ్యి ఎక్కడ తమను అనారోగ్యం బారిన పడేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ కథనం.. నెయ్యి స్వచ్ఛతను ఎలా తెలుసుకోవాలి.. నిపుణులు ఏం చెప్తున్నారో ఓ లుక్కేద్దాం..

దేశీ ఆవు నెయ్యిలో పుష్కలమైన పోషకాలతో పాటు యాంటి యాక్సిడెంట్లు ఉంటాయి. ఈ నెయ్యిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే బ్రెయిన్‌ షార్ప్‌ గా పనిచేయడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మనం తీసుకునే నెయ్యి స్వచ్ఛమైనదా లేదా తెలుసుకోవడానికి ఒక గ్లాస్‌ నీళ్లల్లో స్పూన్‌ నెయ్యి వేయాలి.. నెయ్యి నీటిపై తేలితే అది స్వచ్ఛమైనదని లెక్క.. నీటి అడుగు భాగానికి చేరితే అది కల్తీ నెయ్యి. ఒక గిన్నెలో రెండు, మూడు స్పూన్‌ ల నెయ్యి వేసి కాసేపు వేడి చేయాలి.. అలా వేడి చేసిన నెయ్యిని అలాగే వదిలేయాలి. తర్వాతి రోజు నెయ్యి చిన్నపాటి రేణువుల్లా మారి సువాసన వస్తే అది స్వచ్ఛమైనది.. ముద్ద కట్టిందంటే కల్తీది. నెయ్యి ప్యూరిటీ చెక్‌ చేయడానికి ఉప్పునూ ఉపయోగించవచ్చు. రెండు స్పూన్ల నెయ్యిలో హాఫ్‌ స్పూన్‌ ఉప్పు వేసి ఇరవై నిమిషాల తర్వాత చూడాలి. నెయ్యి అలాగే ఉంటే స్వచ్ఛమైనది.. రంగు మారితే కల్తీది. అర చేతిలో కాసింత నెయ్యి వేసుకోవాలి.. అది కాసేపట్లోనే కరిగితే స్వచ్ఛమైనది.

First Published:  21 Sept 2024 3:01 PM GMT
Next Story