Telugu Global
Health & Life Style

వింటర్‌‌లో డయాబెటిస్ డైట్ ఎలా ఉండాలంటే..

వాతావరణాన్ని బట్టి కూడా రక్తంలో షుగర్ లెవల్స్ మారుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతల వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లకు షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

వింటర్‌‌లో డయాబెటిస్ డైట్ ఎలా ఉండాలంటే..
X

వాతావరణాన్ని బట్టి కూడా రక్తంలో షుగర్ లెవల్స్ మారుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతల వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లకు షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివాళ్లు వింటర్ డైట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

డయాబెటిస్ ఉన్నవాళ్లు వింటర్‌‌లో ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. డయాబెటిస్ ను నెగ్లెక్ట్ చేయడం ద్వారా అవయవాల పనితీరు మందగిస్తుంది. గుండె, కిడ్నీల పనితీరు దెబ్బ తింటుంది. కాబట్టి ఈ సీజన్‌లో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అయ్యేలా డైట్ తీసుకోవాలి.

చలికాలంలో జంక్ ఫుడ్ తగ్గించి కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలు షుగర లెవల్స్‌ను అదుపులో ఉంచడంతో సాయపడతాయి. క్యారెట్‌, బీట్‌రూట్‌, బచ్చలి కూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకలీ, బీన్స్, మొక్కజొన్న.. వంటివి షుగర్ లెవల్స్‌తోపాటు వెయిట్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచుతాయి. అలాగే జింక్ ఎక్కువగా ఉండే చేపలు, గింజలు, నట్స్, గుడ్లు, ముడి ధాన్యాల వంటివి తీసుకోవడం ద్వారా ఇన్సులిన్‌ లెవల్స్ పెరిగి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.

చలికాలంలో సిట్రస్ ఫ్రూట్స్ తప్పక తినాలి. వీటలో ఉండే విటమిన్–సీ ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది వింటర్‌‌లో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. అలాగే బెర్రీ జాతి పండ్లను డయాబెటిస్‌కు సూపర్‌ఫుడ్‌గా చెప్తారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌.. డయాబెటిస్‌ను కంట్రోల్ లో ఉంచుతాయి. ఇవి తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉండే ఫుడ్స్.

చలికాలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే రైస్, ఆలుగడ్డల వంటివాటిని తగ్గిస్తే మంచిది. అన్నం కోసం బ్రౌన్ రైస్ వాడుకోవచ్చు. లేదా గోధుమపిండితో చేసిన రోటీలు తీసుకోవచ్చు. ఇకపోతే వింటర్‌‌లో సరైన మొత్తంలో ప్రొటీన్ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. దీనికోసం గుడ్లు, గింజల వంటివి తీసుకోవచ్చు.

డయాబెటిస్ ఉన్నవాళ్లు చలికాలంలో టీ,కాఫీలకు దూరంగా ఉంటే మంచిది. అలాగే అల్కహాల్ వల్ల శరీరం మరింత డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి డ్రింకింగ్ తగ్గించాలి. టీ, కాఫీలకు బదులు గ్రీన్ టీ, హెర్బల్ టీల వంటివి తాగొచ్చు.

First Published:  2 Jan 2024 6:24 PM IST
Next Story