Telugu Global
Health & Life Style

చెమట దుర్వాసనను దూరం చేసుకుందాం ఇలా..

వేసవి కాలం వచ్చిందంటే చాలామంది భయపడే విషయం చెమటలు. మన చర్మం నుంచి బయటికొచ్చిన చెమట మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

చెమట దుర్వాసనను దూరం చేసుకుందాం ఇలా..
X

వేసవి కాలం వచ్చిందంటే చాలామంది భయపడే విషయం చెమటలు. మన చర్మం నుంచి బయటికొచ్చిన చెమట మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచే ఒక సహజసిద్ధమైన మార్గం. అందుకే చెమట పట్టడం ఆరోగ్యమే కానీ కొందరిలో దానివల్ల వచ్చే దుర్వాసన చాలా ఇబ్బంది పెడుతుంది. చెమట పట్టినప్పుడు ప్రతి ఒక్కరికీ వారి శరీరాన్ని బట్టి వేర్వేరు వాసనలు వస్తుంటాయి.ఈ దుర్వాసన పక్కన ఉండే వారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మన శరీరం చెమట ఎందుకు దుర్వాసన వెదజల్లుతుంది? దీన్ని నివారించే మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం.

మనకు చెమట పట్టినప్పుడు శరీరం నుంచి వెలువడే దుర్వాసనపై ఆహారంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు వెల్లుల్లి, మాంసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకుంటే శరీరం నుంచి చెమటతో సహా వివిధ మార్గాల ద్వారా అది బయటికి వెళ్లిపోతుంది. కొవ్వు పదార్ధాలు, గుడ్డు లాంటి ఆహారం తిన్న వారిలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకున్న వారిలో అధికంగా చెమట రావడమే కాకుండా, దుర్వాసన కూడా చోటుచేసుకుంది. ఇక ఊబకాయం, మధుమేహం, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతుంటే ఈ వాసన మరింత తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ దుర్వాసన నుంచి బయట పడటానికి మార్కెట్లో దొరికే పర్ఫ్యూమ్ కన్నా ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే చెమట వాసన రాదు.

ఎండాకాలంలో తప్పకుండా రెండు సార్లు చన్నీటి స్నానం చేయడం మంచిది. వేడినీరు కాకుండా చన్నీరు స్నానం దుర్వాసనను దూరం చేస్తుంది. అలాగే స్నానం చేసే నీళ్లలో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు వేసుకుంటే మంచిది. కలబందలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలున్నాయి. కలబంద గుజ్జును తీసుకుని దూది సాయంతో చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో రాయాలి. పది నిమిషాలయ్యాక కడిగేసుకుంటే చాలు. ఇలా రోజుకోసారి చేస్తే చెమట వాసన తగ్గుతుంది. బ్యాక్టీరియా వల్లే చెమట వాసన వస్తుందని మనకి తెలుసు. వేపాకులో బ్యాక్టీరియా చంపే గుణాలుంటాయి. అందుకే వేపాకుల్ని మెత్తని పేస్ట్ లాగా చేసి చెమట వచ్చే అండర్ ఆర్మ్స్ దగ్గర రాసుకోండి. పావుగంట అలా ఉంచి , కాస్త ఆరాక కడిగేసుకుంటే చాలు. టమటా రసం,బంగాళా దుంపల రసం వల్ల కూడా చాలా మార్పు కనిపిస్తుంది.

First Published:  15 March 2024 12:18 PM GMT
Next Story