Telugu Global
Health & Life Style

కల్తీ నూనెను ఇలా కనిపెట్టొచ్చు!

కల్తీ వంట నూనెను గుర్తించేందుకు ఫుడ్ సేఫ్టీ అధారిటీ కొన్ని సూచనలు చేసింది.

కల్తీ నూనెను ఇలా కనిపెట్టొచ్చు!
X

వంట గదిలో వాడే పదార్థాల్లో ఎక్కువగా కల్తీ జరిగేది నూనెలోనే అన్న విషయం మీకు తెలుసా? సాధారణంగా మన వంటకాల్లో నూనె వాడకం తప్పనిసరి. వంట నూనెల్లో జరుగుతున్న కల్తీని గుర్తించకపోతే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ కల్తీ నూనెలపై కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..

వంట నూనె ధరలు ప్రతీ ఏడాది పెరుగుతూ పోతున్నా నూనెల క్వాలిటీ మాత్రం అంతకంతకూ తగ్గుతూ పోతుందంటున్నారు నిపుణులు. అందుకే వంట నూనె ఎంచుకునే విషయంలో ప్రతి -ఒక్కరూ కాస్త శ్రద్ధ వహించాలి. నిజమైన నూనెను మాత్రమే వంటలకు వాడాలి. కల్తీ నూనెల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

అడ్వర్టైజ్‌మెంట్స్‌లో చూపించిన విధంగా వంట నూనెలు నిజంగా వేరుశెనగలు, సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో తయారుచేయరు. పెట్రోలియం బైప్రొడక్ట్ అయిన రిఫైన్డ్ నూనెను తీసుకుని అందులో కొద్దిగా ఎస్సెన్స్, విటమిన్స్ వంటివి కలుపుతారు. అలాగే కొన్ని నాసిరకం నూనెల్లో ‘ట్రై ఆర్థో-క్రెసిల్ ఫాస్ఫేట్‌’ అనే కెమికల్ కూడా కలుస్తుందట. ఇది గుండె పోటు ప్రమాదాన్ని పెంచే ఒకరకమైన రసాయనం.

కల్తీ వంట నూనెను గుర్తించేందుకు ఫుడ్ సేఫ్టీ అధారిటీ కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఒక గిన్నెలో 2 మి.లీ. నూనె తీసుకుని అందులో ఒక చెంచా ఎల్లో కలర్‌‌లో ఉన్న బటర్(వెన్న) వేయాలి. నూనె రంగు మారకపోతే అది స్వచ్ఛమైనది అని అర్థం. ఒకవేళ నూనె ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ కింద లెక్క. అలాగే నూనెను ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు గట్టిగా పేరుకోకపోతే అది కూడా కల్తీ నూనె కిందే లెక్క.

ఇకపోతే అసలైన నూనె కావాలనుకుంటే ప్యాకెట్లకు బదులు బయట గానుగల వద్ద కొనుక్కోవడం మంచిది. గానుగ నూనె లేదా కోల్డ్ ప్రెస్డ్ నూనెలను సహజంగా తయారుచేస్తారు. అవి ఆరోగ్యానికి పూర్తిగా సేఫ్.

First Published:  25 Jun 2024 11:00 AM IST
Next Story