ఈ వర్కవుట్స్‌తో మెటబాలిజం పెంచుకోవచ్చు!
శరీరంలో మెటబాలిజం పెరగడానికి అన్నిటికన్నా ముఖ్యమైంది వ్యాయామం. ముఖ్యంగా హై ఇంటెన్సిటీ వర్కవుట్లు మెటబాలిక్ రేట్‌పై ఎక్కువ ప్రభావం చూపుతాయి అంటున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్లు.
శరీరంలో మెటబాలిజం పెరగడానికి అన్నిటికన్నా ముఖ్యమైంది వ్యాయామం. ముఖ్యంగా హై ఇంటెన్సిటీ వర్కవుట్లు మెటబాలిక్ రేట్‌పై ఎక్కువ ప్రభావం చూపుతాయి అంటున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్లు. ఇవెలా ఉంటాయంటే..
హై ఇంటెన్సిటీ వర్కవుట్లు, కోర్ ఎక్సర్‌సైజ్‌లు మెటబాలిక్ రేట్‌ను పెంచుతాయి. ముఖ్యంగా వ్యాయామాన్ని ఎక్కువసార్లు చేస్తూ మధ్యలో తక్కువ ఇంటర్వెల్స్ ఇస్తూ ఉంటే మెటబాలిజం ఇంకా త్వరగా పెరుగుతుంది. ఏదైనా వ్యాయామాన్ని ఒక సెట్ చేసిన తర్వాత 30 సెకన్ల కంటే ఎక్కువ రెస్ట్ ఇవ్వకూడదు. ఇలా చేయడం ద్వారా క్రమంగా గుండె సామర్ధ్యం పెరుగుతుంది. తద్వారా మెటబాలిక్ రేట్ త్వరగా పెరుగుతుంది.
కోర్ ఎక్సర్‌సైజెస్
నడుము , పొట్ట, వీపు కింది భాగం (లోయర్‌బ్యాక్)లో ఉండే కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే వర్కవుట్స్‌ను కోర్ ఎక్సర్‌సైజెస్ అంటారు. ఇవి శరీరం పై భాగానికీ, కింది భాగానికీ మధ్య వంతెనలాఉండే కండరాలను బలంగా చేస్తాయి. ఈ కోర్ వ్యాయామాలను బ్రిడ్జెస్, ప్లాంక్, ఫిట్‌నెస్‌బాల్ వంటి వాటితో మరింత తేలికగా చేయొచ్చు. ఈ వర్కవుట్స్ చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది.
స్ట్రెంత్ ట్రైనింగ్
స్ట్రెంత్ ట్రైనింగ్‌లో బరువులు ఎత్తాలి. బరువులు ఎత్తడం వల్ల లీన్ మజిల్ మాస్ తయారవుతుంది. ఈ వర్కవుట్స్ నిద్రావస్థలో ఉన్న మెటబాలిజం మేల్కొనేలా చేస్తాయి. కేవలం బరువులు ఎత్తడమే కాకుండా.. బాడి వెయిట్‌నే ఆధారంగా చేసుకొని పుషప్స్, పులప్స్, అబ్డామినల్ క్రంచెస్, లెగ్ స్క్వాట్స్ వంటి వ్యాయామాలు కూడా చేయొచ్చు.
ఇక వీటితోపాటు మెటబాలిజం పెరగాలంటే లైఫ్‌స్టై్ల్ ఒక క్రమపద్ధతిలో ఉండాలి. రోజూ ఒకే టైంకి తినడం, నిద్ర పోవడం చేయాలి. ఇలా శరీరాన్ని టైం టేబుల్ ప్రకారం ట్యూన్ చేయడం ద్వారా మెటబాలిజం వేగంగా పెరుగుతుంది.