Telugu Global
Health & Life Style

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

చలికాలం వచ్చిందంటే అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్య డ్రై స్కిన్. చల్లని గాలుల కారణంగా చర్మం నిర్జీవమై ఎండిపోయినట్టు కన్పిస్తుంది.

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే..
X

చలికాలం వచ్చిందంటే అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్య డ్రై స్కిన్. చల్లని గాలుల కారణంగా చర్మం నిర్జీవమై ఎండిపోయినట్టు కన్పిస్తుంది. పొడిబారిపోయి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. చికాకు, దురదగా ఉంటూ చాలా ఇబ్బంది పెడుతుంది. సరైన చర్యలు తీసుకోకపోతే కఠినమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. చల్లటి గాలి, తక్కువ తేమ, వేడి జల్లులు, మందపాటి దుస్తులు వేసుకోవడం.. ఈ కారణాల వల్ల చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. చలి కాలంలో ఈ సింపుల్ టిప్ప్ ఉపయోగిస్తే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచు కోవచ్చు.

శీతా కాలంలో చర్మం పొడి బారుతుంది. దీంతో ఎంతో కాస్ట్ లీ మాయిశ్చ రైజర్స్ ఉపయోగిస్తాము. కానీ అదొక్కటే సరిపోదు. చర్మంలో తేమ స్థాయిని మెరుగుపరచాలి అంటే ఈ కాలంలో అధికంగా నీళ్లు తాగాల్సిందే.


చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే అదో హాయి. ఎంతో ఆనందంగా ఉన్నప్పటికీ, ఇది చర్మంలోని సహజమైన ఆయిల్ కంటెంట్‌ను నాశనం చేస్తుంది. ఫలితంగా చర్మం పొడిబారడాన్ని పెంచుతుంది. ఫలితంగా తరచుగా దురద, చర్మం పొరలుగా ఉంటుంది. అందుకే వేడి నీటి స్నానానికి బదులుగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ఇది చర్మం సహజ నూనెలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది.

చలికాలంలో స్వెటర్లు, శాలువాలు, మందపాటి బట్టలు ధరించడం సర్వసాధారణం. ఈ బిగుతు దుస్తులను ధరించడం వల్ల చర్మంపై రాపిడి ఏర్పడి చికాకు కలుగుతుంది. ఇది దురదను కలిగిస్తుంది.ఈ చికాకును తగ్గించడానికి కాటన్ వంటి మృదువైన, శ్వాసక్రియకు అనుకూలమైన బట్టలను ఎంచుకోండి. అవసరాన్ని బట్టి దానిపైన మరీ బిగుతుగాలేని స్వెటర్లు ధరించండి.

బాదం ఆయిల్ చర్మానికి చాలా మంచిది. బెస్ట్ నేచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా, నిగనిగలాడేలా చేస్తుంది. బాదం ఆయిల్ నేరుగా రాయవచ్చు లేదా ఏదైనా మాయిశ్చరైజర్‌లో కలిపి రాసుకోవచ్చు. అలాగే ఆలీవ్ ఆయిల్ కూడా చర్మానికి నిగారింపు ఇస్తుంది.

హ్యూమిడిఫైయర్లు వాడటం వల్ల గాలిలో తేమ నిలిచి ఉంటుంది. ఇది చర్మం నిర్జలీకరణం కాకుండా నిరోధిస్తుంది. వీటిని గదిలో ఉంచడం వల్ల వాతావరణంలో తేమ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. శీతాకాలంలో చర్మానికి మాత్రమే కాకుండా శ్వాసకోశ ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది .

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పొడిచర్మం, దురద నుండి బయటపడవచ్చు. కాబట్టి తాజా పండ్లు మరియు కూరగాయలు తప్పక తీసుకోండి.

First Published:  14 Dec 2023 9:59 AM IST
Next Story