మీకు ఇంటర్నెట్ అడిక్షన్ ఉందా? ఇలా చెక్ చేసుకోండి!
టీనేజ్ లో చాలామంది మనుషులతో కలవకుండా ఒంటరిగా ఉంటూ ఇంటర్నెట్‌లో ఎక్కువసమయం గడుపుతుంటారు. ఇలాంటివాళ్లు ఆన్‌లైన్ అశ్లీల వీడియోలు చూడడం లేదా ఛాట్ రూమ్స్‌లో గడపడం వంటివి చేస్తుంటారు. దీన్ని ‘సైబర్ సెక్స్ అడిక్షన్’ అంటారు.
ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడకం అనేది చాలా సాధారణమైన విషయం. అయితే అవసరాలకు ఇంటర్నెట్ వాడడం వేరు. ఇంటర్నెట్‌కు అడిక్ట్ అవ్వడం వేరు. ఇందులో మీరు ఏ కోవకు చెందినవారో ఇలా తెలుసుకోండి.
ఏదైనా విషయాన్ని సెర్చ్ చేయడం కోసం లేదా ఇతరపనుల కోసం ఇంటర్నెట్ వాడడం అనేది అందరూ చేసేదే. అయితే అదేపనిగా ఇంటర్నెట్ ను వాడుతూ.. దానికి బానిసలు అవుతున్నవాళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నారని మానసిక నిపుణులు చెప్తున్నారు. ఇంటర్నెట్ అడిక్షన్‌లో పలు రకాలున్నాయట. ఇవెలా ఉంటాయంటే..
టీనేజ్ లో చాలామంది మనుషులతో కలవకుండా ఒంటరిగా ఉంటూ ఇంటర్నెట్‌లో ఎక్కువసమయం గడుపుతుంటారు. ఇలాంటివాళ్లు ఆన్‌లైన్ అశ్లీల వీడియోలు చూడడం లేదా ఛాట్ రూమ్స్‌లో గడపడం వంటివి చేస్తుంటారు. దీన్ని ‘సైబర్ సెక్స్ అడిక్షన్’ అంటారు. ఇదొక రకమైన మానసిక రుగ్మత. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రకరకాల మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రానురానూ ఒత్తిడి, యాంగ్జైటీకి దారి తీస్తుంది.
ఇంటర్నెట్‌లో అదేపనిగా ఆటలు ఆడడం, బెట్టింగ్స్ వేయడం, గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్ వంటి వాటికి అలవాటు పడడాన్ని ‘ఇంటర్నెట్ కంపల్షన్’ అడిక్షన్ అంటారు. ఈ అలవాటు ఒత్తిడిని పెంచుతుంది. మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. ఇలాంటి అడిక్షన్ బారిన పడిన వాళ్లు దాన్నుంచి బయటపడడం కష్టం.
ఇక అందరికీ తెలిసిన మరో ఇంటర్నెట్ అడిక్షన్ పేరు ‘సోషల్ మీడియా అడిక్షన్’. గంటల తరబడి రీల్స్ చూడడం, అదేపనిగా సోషల్ మీడియాలో గడపడం వంటివి ఈ కోవకు చెందుతాయి. ఈ అలవాటు వల్ల రియల్ వరల్డ్‌కు దూరమవుతారు. సోషల్ లైఫ్ దెబ్బ తింటుంది. ఒత్తిడి పెరుగుతుంది.
ఇంటర్నెట్‌లో అదేపనిగా ఏదైనా విషయం గురించి సెర్చ్ చేయడాన్ని ‘కంపల్సివ్ ఇన్ఫర్మేషన్ సీకింగ్’ అంటారు. ఇలాంటి వారికి ఊరికే ఏదో ఒకటి తెలుసుకోవాలనే తపన ఉంటుంది. ఇది మరీ ఎక్కువైతే.. యాంగ్జైటీ మొదలవుతుంది. పనుల మీద ఏకాగ్రత తగ్గిపోతుంది.
ఇంటర్నెట్ అడిక్షన్ ఉన్నవాళ్లు స్వతహాగా తాము అడిక్ట్ అయిన విషయాన్ని తెలుసుకోవడం కష్టం. స్నేహితులు, బంధువులు గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్నెట్ అడిక్షన్.. పెద్దపెద్ద మానసిక రుగ్మతలకు దారితీయగలదు. కాబట్టి మొదట్లోనే దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. కేవలం ఇంటర్నెట్‌కు దూరంగా ఉండడం ద్వారా ఈ అడిక్షన్ నుంచి బయటపడొచ్చు. అడిక్షన్ మరీ ఎక్కువైతే సైకాలజిస్టుల సాయం తీసుకోవాలి.