Telugu Global
Health & Life Style

సైంధవ లవణంతో ఉపయోగాయాలెన్నో..

సైంధవ లవణం నిజానికి ఉప్పు కాదు. అది మెగ్నీషియం, సల్ఫేట్‌లతో తయారైన ఒక ఖనిజ లవణం. ముదురు నీలం, ఊదారంగు, గులాబీ, నారింజ, ఎరుపు, పసుపు, బూడిద రంగుల్లో దొరుకుతుంది.

సైంధవ లవణంతో ఉపయోగాయాలెన్నో..
X

వండిన వంటకి రుచి రావాలంటే ఖచ్చితంగా అందులో చిటికెడు ఉప్పు వేయాల్సిందే. ఉప్పు లేకపోతే అది ఎలాంటి వంటైనా సరే తినలేమన్నది తెలిసిన విషయమే. అదే ఉప్పు ఎక్కువైతే మాత్రం ముప్పు తప్పదు. హైబీపీ, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం చాలా ఉంది. ఇక బీపీ రోగులు అయితే ఉప్పును చాలా తక్కువగా తినాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకు ఉప్పుకు బదులుగా కనిపించే ప్రత్యామ్నాయమే హిమాలయన్ క్రిస్టల్ సాల్ట్ అని పిలుచుకొనే సైంధవ లవణం.

సైంధవ లవణం నిజానికి ఉప్పు కాదు. అది మెగ్నీషియం, సల్ఫేట్‌లతో తయారైన ఒక ఖనిజ లవణం. ముదురు నీలం, ఊదారంగు, గులాబీ, నారింజ, ఎరుపు, పసుపు, బూడిద రంగుల్లో దొరుకుతుంది. సైంధవ లవణం ఇతర ఉప్పులకంటే ఖరీదు ఎక్కువగా ఉన్నా స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఎలాంటి రసాయనాలు ఇందులో కలవవు. అందుకే సాధారణ ఉప్పుకు ఇది ఆరోగ్యకరమైన ప్రత్యాహ్నాయంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో అయోడిన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.

ఉప్పుకు బదులు సైంధవ లవణంను వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అంతేకాక మనం రోజు వాడే ఉప్పు కన్నా సైంధవ లవణం చాలా తక్కువ పడుతుంది. అంటే మూడు స్పూన్ల ఉప్పును వాడే బదులు రెండు స్పూన్ల సైంధవ లవణం సరిపోతుంది. సైంధవ లవణాన్ని వాడటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది. థైరాయిడ్ సమస్యకు పరిష్కారంగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా సహాయపడుతుంది.

మజ్జిగలో కాస్త సైంధవ లవణం కలిపి తాగితే అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. జీవక్రియ సాఫీగా జరుగుతుంది. సైంధవ లవణంలో ఐరన్‌ ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది ఉపయోగపడుతుంది.

సైంధవ లవణం నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు ముక్కు మూసుకుపోవడం, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు, ముక్కులో శ్లేష్మాన్ని తొలగించటానికి సైంధవ లవణం సహాయపడుతుంది. గొంతు నొప్పి, గొంతులో మంట ఉన్నప్పుడు సైంధవ లవణం నీటిని పుక్కిలిస్తే సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే హిమాలయ ఉప్పును శరీరానికి ఔషధ నిధిగా చెబుతారు.

First Published:  10 April 2024 9:48 AM IST
Next Story