Telugu Global
Health & Life Style

కార్బోహైడ్రేట్స్ ఎలా తీసుకోవాలంటే..

శరీరానికి కావల్సిన పోషకాల్లో కార్బోహైడ్రేట్స్ చాలా కీలకమైనవి. కార్బోహైడ్రేట్స్ ద్వారానే శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంలో రెండు రకాల కార్బోహైడ్రేట్స్ ప్రధానంగా ఉంటాయి.

కార్బోహైడ్రేట్స్ ఎలా తీసుకోవాలంటే..
X

శరీరానికి కావల్సిన పోషకాల్లో కార్బోహైడ్రేట్స్ చాలా కీలకమైనవి. కార్బోహైడ్రేట్స్ ద్వారానే శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంలో రెండు రకాల కార్బోహైడ్రేట్స్ ప్రధానంగా ఉంటాయి. అవేంటంటే.

కార్బోహైడ్రేట్స్‌లో ‘సింపుల్ కార్బ్స్’, ‘కాంప్లె్క్స్ కార్బ్స్’ అని రెండు రకాలుంటాయి. వీటిలో ఒకటి శరీరానికి మేలు చేస్తే మరొకటి కీడు చేస్తుంది. ఎవరెవరు ఎలాంటి కార్బ్స్ ఎంచుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా రోజువారీ తీసుకునే ఆహారంలో.. ప్రొటీన్స్, ఫ్యా్ట్స్‌ కంటే కార్బోహైడ్రేట్సే ఎక్కువగా ఉంటాయి. రైస్, బ్రెడ్, ఇడ్లీ, దోశె, రోటీ, ఉప్మా.. ఇలా ప్రతీ దాంట్లో కార్బో్హైడ్రేట్స్ ఉంటాయి. అయితే వీటిలో కేవలం క్యాలరీలను మాత్రమే కలిగి ఉండేవాటిని సింపుల్ కార్బ్స్ అంటారు. ఇవి తింటే శక్తి లభిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. ఎలాంటి శారీరక శ్రమ లేనివాళ్లు వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తెల్ల బియ్యం, బ్రెడ్, మైదా వంటివి ఈ కోవకు చెందుతాయి.

ఇక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ విషయానికొస్తే.. వీటిలో కార్బోహైడ్రేట్స్‌తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. క్యాలరీలతో పాటు పీచు పదార్థాలు(ఫైబర్) కూడా ఉండే పదార్థాలను కాంప్లెక్స్ కార్బ్స్‌గా చెప్పుకోవచ్చు. గోధుమలు, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ఓట్స్ వంటివి ఈ కోవకు చెందుతాయి.

రోజువారీ పోషణలో భాగంగా ప్రతి ఒక్కరూ కార్బోహైడ్రేట్స్ తప్పక తీసుకోవాలి. అయితే కేవలం సింపుల్ కార్బ్స్ మాత్రమే ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా గ్లూకోజ్ లెవల్స్ పెరిగి బరువు పెరిగే ప్రమాదముంది. కాబట్టి వాటికి బదులు కాంప్లెక్స్ కార్బ్స్‌ను ఎంచుకుంటే ఆరోగ్యానికి మంచిది. వీటిని తీసుకోవడం ద్వారా మెటబాలిజం పెరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తాయి.

ఇకపోతే పండ్లు, కాయగూరలు కూడా కాంప్లెక్స్ కార్బ్స్‌ కిందకే వస్తాయి. దుంప కూరల్లో ఫైబర్ తక్కువ. కాబట్టి వాటిని సింపుల్ కార్బ్స్ అనుకోవచ్చు. అలాగే బేకరీ ఫుడ్స్, చిప్స్, స్వీట్స్ వంటివి పూర్తిగా సింపుల్ కార్బ్స్ కిందకు వస్తాయి.

First Published:  20 July 2024 3:15 AM GMT
Next Story