శరీరాన్ని వెచ్చగా ఉంచే ఫుడ్స్ ఇవే..
Foods for body warm in winter: చలి నుంచి కాపాడుకోవడానికి స్వెటర్లు, మందమైన దుస్తులు లాంటివి వేసుకుంటుంటాం. అయితే శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుకోవడం ద్వారా చలిని తట్టుకోవడం ఇంకా ఈజీ అవుతుంది.
చలి నుంచి కాపాడుకోవడానికి స్వెటర్లు, మందమైన దుస్తులు లాంటివి వేసుకుంటుంటాం. అయితే శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుకోవడం ద్వారా చలిని తట్టుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. శరీరం వెచ్చగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే..
చిలగడ దుంప: స్వీట్ పొటాటో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. చలికాలంలో తలెత్తే డైజెషన్ ప్రాబ్లమ్స్, బద్దకాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. చిలగడ దుంప తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం అందడంతో పాటు ఎ, సి విటమిన్లు, పొటాషియం, ఫైబర్ వంటి మినరల్స్ కూడా లభిస్తాయి.
అల్లం టీ: అల్లం టీ తాగడం వల్ల చలి నుంచి రిలీఫ్ దొరుకుతుంది. చలికాలంలో రోజూ అల్లం తీసుకోవడం వల్ల జీర్ణప్రక్రియను వేగవంతం అవుతుంది. శరీరం వెచ్చగా ఉంటుంది.
నాన్ వెజ్: మాంసానికి కూడా శరీరాన్ని వెచ్చబరిచే లక్షణం ఉంది. మాంసంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరమంతటా ఆక్సిజన్ సరఫరా సాఫీగా జరిగేలా చూస్తుంది. దీనివల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.
తేనె: తేనెతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి రాకుండా తేనె అడ్డుకుంటుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. శరీరం వేడిగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.
అరటి: అరటిపండ్లలో ఉండే విటమిన్ బి, మెగ్నీషియ.. థైరాయిడ్, అడ్రినలిన్ గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల శరీరం ఉండాల్సిన టెంపరేచర్‌లో ఉంటుంది. చలిని తట్టుకోవడం తేలకవుతుంది.