Telugu Global
Health & Life Style

వేసవిలో గుండెకు రిస్క్ ఎక్కువ.. ఇలా జాగ్రత్తపడదాం

గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మారిపోతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్, పొగాకు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి.

వేసవిలో గుండెకు రిస్క్ ఎక్కువ.. ఇలా జాగ్రత్తపడదాం
X

గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మారిపోతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్, పొగాకు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. కొన్నిసార్లు అప్పటి వరకు బాగానే ఉండి ఉన్నపాటుగా కుప్పకూలి గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు భయాన్ని కలిగిస్తున్నాయి. క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ కూడా కుప్పకూలి చనిపోతున్నారు. వీటన్నింటికీ కూడా గుండెపోటే కారణం. ప్రాణాలు హరించే ఈ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తులకు గుండెల్లో మంట, జ్వరం లేదా ఛాతీ కండరాలలో బిగుతుగా అనిపిస్తుంది. ఎందుకంటే హార్ట్ ఎటాక్ గుండెకు వెళ్లే రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. నిజానికి గుండెపోటు లక్షణాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. గుండెపోటు అనగానే ఛాతిలో వచ్చే నొప్పి మాత్రమే అనుకుంటారు. కానీ శరీరంలో అనేక భాగాల్లో వచ్చే నొప్పిని కూడా గుండెపోటును సూచిస్తాయి.

రాత్రిపూట కడుపు, భుజాలు, వీపు, దవడ, మెడ లేదా గొంతులో నొప్పి ఉంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఒక్కోసారి దానిని ఎసిడిటీగా కూడా పరిగణిస్తారు. కానీ చెమటలు పట్టడం, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించటం లేదా అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఒక్కోసారి నిద్రపోయేటప్పుడు ఎక్కువగా చెమట పడితే అది గుండె సమస్యకు కూడా కావచ్చు. డాక్టర్ సలహా మేరకు చెకప్ చేయించుకోవాలి. ఇక గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో ఎడమ భుజం, చేయి, వీపు, మెడ, దవడలో నొప్పి రావడం. అకస్మాత్తుగా నొప్పి వచ్చినా, ఎక్కువ సమయం నొప్పి కొనసాగుతున్నా వెంటనే అలర్ట్‌ అవ్వాలి. ఇక అకస్మాత్తుగా తల తిరగడం, వాంతులు, వికారంగా అనిపించినా వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి కూడా గుండెపోటుకు ప్రాథమిక లక్షణాలుగా చెబుతున్నారు. ఒక్కోసారి పైన చెప్పిన ఎలాంటి నొప్పులు లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

ఏమాత్రం గుండెపోటు లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ తక్షణం ఈసీజీ, ఎకో, బ్లడ్ టైటర్స్ వంటి కొన్ని సాధారణ పరీక్షలు చేసి గుండెనొప్పి వచ్చే అవకాశం ఉందో లేదో తేలుస్తారు.

First Published:  7 Jun 2024 4:50 PM IST
Next Story