Telugu Global
Health & Life Style

ఈ సింపుల్ టిప్స్‌తో.. మీ హార్ట్ పూర్తిగా సేఫ్!

రోజువారీ జీవితంలో తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటోంది. ముఖ్యంగా ఈరోజుల్లో తక్కువ వయసులోనే గుండె పోటు సమస్యలు వస్తున్నాయి. అందుకే గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలంటున్నారు డాక్టర్లు.

ఈ సింపుల్ టిప్స్‌తో.. మీ హార్ట్ పూర్తిగా సేఫ్!
X

రోజువారీ జీవితంలో తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటోంది. ముఖ్యంగా ఈరోజుల్లో తక్కువ వయసులోనే గుండె పోటు సమస్యలు వస్తున్నాయి. అందుకే గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలంటున్నారు డాక్టర్లు.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా సెడంటరీ లైఫ్‌స్టైల్ నుంచి యాక్టివ్ లైఫ్‌స్టైల్‌కు మారాలి. వీటితోపాటు గమనించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలేంటంటే..

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. 3 నుంచి 5 శాతం వరకు బరువు తగ్గడం వల్ల రక్తంలో కొన్ని కొవ్వులు, రక్తంలో గ్లూకోజ్‌ , టైప్‌–2 డయాబెటిస్‌ ప్రమాదం కొంత వరకూ తగ్గుతుంది.

ఏ వయసు వారైనా కంటి నిండా నిద్రపోవాలి. పెద్దలకు రాత్రిపూట కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. రోజూ ఒకే సమయాల్లో పడుకోవడం, మేల్కోవడం చేయాలి.

స్మోకింగ్, డ్రింకింగ్, గుట్కాల వాడకాన్ని మానేయాలి. ఈ అలవాటు ఇప్పటికిప్పుడు మానేసినా గుండె జబ్బు ప్రమాదం సగం తగ్గుతుంది.

పండ్లు, బీన్స్, చిక్కుళ్లు వంటివి, చేపలు, తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు కలిగిన పదార్థాలు తీసుకోవాలి. అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎక్కువ ఉప్పు, చక్కెర ఉండేవి, ప్రాసెస్‌ చేసిన కార్బోహైడ్రేట్‌ ఆహారాలు, ఆల్కహాల్, మాంసం, కొవ్వు, కార్బోనేటెడ్ డ్రింక్స్, పాల ఉత్పత్తులు, వేయించిన ఫాస్ట్‌ ఫుడ్, చిప్స్, కాల్చిన ఆహారం వంటివాటికి దూరంగా ఉండాలి.

రోజూ 20 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం ఉండేలా చూసుకోవాలి.

ఉద్యోగాలు చేసేవాళ్లు ఒకేరకమైన పనికి అతుక్కుపోవడం వల్ల తెలియకుండానే స్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి ఉద్యోగులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి.

ఈ మధ్య కాలంలో యూత్ వెస్టర్న్ ఫుడ్స్‌ను ఎక్కువ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి జంక్ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటైతే.. ఫ్యూచర్‌‌లో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.

విటమిన్– బి లో ఉండే ఫోలిక్ యాసిడ్ గుండె ప్రమాదాలను తగ్గిస్తుంది. అలాగే మెగ్నీషియం, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

అన్నింటికంటే ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి లింక్ ఉంది. డిప్రెషన్, బాధతో ఉండేవాళ్లకు రక్తప్రసరణ కష్టంగా మారుతుంది. అలాకాకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉంటే.. బ్లడ్ వెజిల్స్ రిలాక్స్ అయ్యి రక్త సరఫరా పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు కార్డియో వర్కవుట్లు, యోగా, ధ్యానం వంటివి చేయొచ్చు.

First Published:  4 May 2024 10:28 PM IST
Next Story