వేసవిలో చల్లబడదామిలా..
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మీ శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే వేసవిలో పుష్కలంగా నీరు త్రాగడం, శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
మార్చి నెలకే ఎండలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది . ఇప్పుడే ఇలా ఉంది అంటే.. మున్ముందు ఎండల వేడి మరింత పెరిగిపోతుంది. అయితే.. ఈ వేడిని తట్టుకోవాలంటే ఇవన్నీ మీ డైట్లో చేర్చుకోవాల్సిందే.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మీ శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే వేసవిలో పుష్కలంగా నీరు త్రాగడం, శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. నీటితో పాటు, పండ్లు, కూరగాయల జ్యూస్‌లు తాగడం వల్ల కూడా శరీరం కూల్ అవుతుంది. పుదీనా, నిమ్మకాయలో ఉన్న శీతలీకరణ గుణాలు శరీర నీటి సమతుల్యతని కాపాడతాయి.
ఇక వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలలో ముఖ్యమైనది పెరుగు. ఇది జీర్ణాశయ ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు మాత్రమే కాదు, పాలు, చీజ్ మొదలైన పాల ఉత్పత్తులలో ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటుంది. వేసవి రోజుల్లో కడుపు చల్లగా ఉండాలంటే రోజుకు ఒక్కసారైనా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి.
వేడిని తాళలేక చాలా మంది చల్లని పదార్థాలు తీసుకుంటారు, చక్కెర పానీయాలు, చల్లటి బీర్లు వంటి వాటికోసం ఆరాటపడతారు. ఇవి తీసుకునేటపుడు బాగానే అనిపిస్తుంది కానీ, కడుపులోకి వెళ్లిన తర్వాత ఇబ్బందిని కలిగిస్తాయి. మీరు తీసుకునే ఆహార పానీయాలలోని కృత్రిమ పదార్ధాలు, సంతృప్త కొవ్వులు మీ ప్రేగు ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి.
వేసవిలో పుచ్చకాయ తినడం చాలా మంచింది. దీన్ని జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో దీనిని తినడం ఉత్తమం. అలాగే తృణధాన్యాలు మీకు చాలా అవసరమైన పోషణను అందిస్తాయి, మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. బార్లీ, రాగులు వంటివి మంటను తగ్గించడమే కాకుండా మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఇక ఓట్స్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
వేడి, మంటతో పోరాడటంలో అరటిపండ్లు తమ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తాయి. ఈ పండు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా, ఇది అతిసారం, కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. నీరసంగా మారిన శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. అలాగే వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు దోసకాయ ఉత్తమమైన ఆహారం.
వీటన్నింటితో పాటూ కాటన్ వంటి వదులుగా, తేలికైన, శ్వాసక్రియకు అనుకూలమైన దుస్తులు, మిమ్మల్ని చల్లగా హాయిగా ఉంచుతాయి.