Telugu Global
Health & Life Style

వర్షాకాలంలో జలుబు, దగ్గు రాకుండా..

సీజన్‌ను బట్టి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పు వంటి సమస్యలు చాలా కామన్‌గా వస్తుంటాయి.

వర్షాకాలంలో జలుబు, దగ్గు రాకుండా..
X

సీజన్‌ను బట్టి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పు వంటి సమస్యలు చాలా కామన్‌గా వస్తుంటాయి. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో వీటికి ఈజీగా చెక్ పెట్టొచ్చు. అదెలాగంటే.

వర్షాకాలంలో వాతావరణంలో పెరిగే తేమ కారణంగా ముక్కు దిబ్బడ, దగ్గు, గొంతు నొప్పి వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇవి వచ్చినప్పుడు వంటింటి చిట్కాలతోనే వీటిని తగ్గించుకోవచ్చు.

తేమ వల్ల ఏర్పడే జలుబు త్వరగా తగ్గాలంటే రోజుకోసారి ఆవిరి పట్టాలి. మరిగే నీటిలో కొద్దిగా పసుపు, యూకలిప్టస్ ఆయిల్ వంటివి వేసి ఆవిరి పడితే ముక్కు నాళాలు, లంగ్స్‌లో పేరుకున్న క్రిములు నశిస్తాయి. కఫం కూడా తగ్గుతుంది. ఫలితంగా జలుబు తగ్గుతుంది.

వర్షాకాలంలో దగ్గు, గొంతు నొప్పి వస్తుంటే వేడి నీటిలో తులసి ఆకులు, లవంగాలు వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. దీనివల్ల గొంతు నాళాల్లో ఉన్న బ్యాక్టీరియా నశించి గొంతు నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. దగ్గు కూడా త్వరగా తగ్గుతుంది.

ముందు జాగ్రత్తలు ఇలా..

చల్లని వాతావరణంలో జలుబు వంటి ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటే అలాంటి వాళ్లు ఇమ్యూనిటీని పెంచుకునే ప్రయత్నం చేయాలి. వర్షాకాలంలో ప్రతిరోజూ తేనె, నిమ్మరసం, అల్లం కలిపిన టీ తాగాలి. కూరల్లో పసుపు తప్పకుండా వాడాలి. అలాగే ఇన్ఫెక్షన్ల రిస్క్ తగ్గించేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.

ఈ సీజన్‌లో వైరల్ ఫీవర్స్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాటి లక్షణాలు కూడా సాధారణ జలుబు, దగ్గు లాగానే అనిపిస్తాయి. కాబట్టి జలుబు, దగ్గుతోపాటు జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌‌ను కలిసి టెస్ట్ చేయించుకోవడం మంచిది.

First Published:  8 Aug 2024 8:45 AM IST
Next Story