పాలు రోజూ తాగొచ్చా?
రోజూ పాలు తాగే అలవాటుంటుంది చాలామందికి. అయితే పాలు పిల్లల్లో ఒకలా పెద్దల్లో ఒకలా పనిచేస్తాయట. అందుకే పెద్దవాళ్లు రోజూ పాలు తాగే అలవాటుని మార్చుకోవాలంటున్నారు డాక్టర్లు.
రోజూ పాలు తాగే అలవాటుంటుంది చాలామందికి. అయితే పాలు పిల్లల్లో ఒకలా పెద్దల్లో ఒకలా పనిచేస్తాయట. అందుకే పెద్దవాళ్లు రోజూ పాలు తాగే అలవాటుని మార్చుకోవాలంటున్నారు డాక్టర్లు.
పాలలో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగని రోజూ తాగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పాలు ఎక్కువగా తాగడం వల్ల పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు పాలు వెంటనే జీర్ణం అవుతాయి. కానీ, పెద్దవాళ్లకు పాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.
పాలు ఎక్కువగా తాగడం వల్ల చర్మంపై దద్దుర్లు, మొటిమలు లాంటి సమస్యలు వస్తాయి. అందుకే మొటిమల సమస్య ఉన్నవాళ్లు పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండడం మంచిది.
పాలు మెదడును కూడా ప్రభావితం చేస్తాయి. పాలు ఎక్కువగా తాగితే జ్ఞాపకశక్తి తగ్గుతుందని కొన్ని స్టడీలు చెప్తున్నాయి.
కొంతమందికి పాలు ఎక్కువగా తాగడం వల్ల వికారం, అసౌకర్యంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రేగుల్లో సమస్యలను కలిగించొచ్చు. పాలు ఎక్కువగా తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా రావొచ్చు.
టీ, కాఫీ తాగేవాళ్లు మళ్లీ ప్రత్యేకంగా పాలు తీసుకోకపోవడమే మంచిది. అలాగే రోజుకు ఒకట్రెండు గ్లాసుల కంటే ఎక్కువ పాలు తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. కాబట్టి పాలను మితంగా తీసుకుంటే మంచిది