Telugu Global
Health & Life Style

మామిడి తొక్కల టీ గురించి తెలుసా? బెనిఫిట్స్ అన్నీఇన్నీ కావు!

మామిడి పండు పైభాగంలోని తొక్కలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్‌ ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. మ్యాంగో పీల్స్‌తో టీ చేసుకుని తాగితే.. చాలా వేగంగా షుగర్​ కంట్రోల్లోకి వస్తుందట. అంతేకాదు ఈ టీతో బరువు కూడా తగ్గొచ్చు.

మామిడి తొక్కల టీ గురించి తెలుసా? బెనిఫిట్స్ అన్నీఇన్నీ కావు!
X

సమ్మర్‌‌లో మామిడి పండ్లు తిని తొక్కలుపారేస్తున్నారా? అలా అయితే మీరు బోలెడు బెనిఫిట్స్ మిస్ అవుతున్నట్టే. ఎందుకంటే షుగర్ కంట్రోల్ నుంచి ఇమ్యూనిటీని బూస్టింగ్ వరకూ మామిడి తొక్కల్లో రకరకాల బెనిఫిట్స్ దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండు పైభాగంలోని తొక్కలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్‌ ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. మ్యాంగో పీల్స్‌తో టీ చేసుకుని తాగితే.. చాలా వేగంగా షుగర్​ కంట్రోల్లోకి వస్తుందట. అంతేకాదు ఈ టీతో బరువు కూడా తగ్గొచ్చు.

మ్యాంగో పీల్‌లో ‘ఏ’, ‘సీ’, ‘కె’ వంటి విటమిన్లతో పాటు పొటాషియం, మాంగనీస్​, మెగ్నీషియం వంటి పలు మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే వాటిలో ఫైబర్ కంటెంట్​, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్​ వంటివి కూడా ఉన్నాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా ఇందులో ‘మ్యాంగిఫెరిన్’​ అనే ఓ ప్రత్యేకమైన కాంపౌండ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్‌ను అదుపు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని సైంటిస్టులు కనుగొన్నారు.

మ్యాంగో పీల్ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఈ టీ గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. కాబట్టి దీన్ని రోజువారీ టీగా కూడా తీసుకోవచ్చు.

మ్యాంగో పీల్ టీతో ఇమ్యూనిటీ వేగంగా బూస్ట్ అవుతుంది. ఇందులో ఉన్న ‘సీ’ విటమిన్ , యాంటీ యాక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి.

మామిడి తొక్కల టీ తాగడం ద్వారా జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. సమ్మర్‌‌లో వచ్చే మలబద్ధకం సమస్యకు ఈ టీతో చెక్ పెట్టొచ్చు.

మ్యాంగో పీల్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ టీ తాగడం ద్వారా మొటిమలు, మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.

ఇలా చేయాలి

పీలర్ సాయంతో మామిడి పండు పై లేయర్‌‌ను తొలిచి వాటిని నీళ్లలో వేసి కాసేపు మరిగించాలి. పావు గంట తర్వాత నీటిని వడకట్టి అందులో తేనె కలుపుకుని తాగొచ్చు. లేదా తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని కూడా టీ చేసుకోవచ్చు.

First Published:  9 May 2024 8:00 AM IST
Next Story