ఈ ప్యాక్స్‌తో చుండ్రుకి చెక్ పెట్టొచ్చు!
పెరుగుతున్న కాలుష్యం వలన చాలామందికి చుండ్రు సమస్య పెరుగుతుంది. చుండ్రుని మొదట్లోనే కంట్రోల్ చేయకపోతే క్రమంగా అది జుట్టు రాలడానికి దారి తీస్తుంది.
పెరుగుతున్న కాలుష్యం వలన చాలామందికి చుండ్రు సమస్య పెరుగుతుంది. చుండ్రుని మొదట్లోనే కంట్రోల్ చేయకపోతే క్రమంగా అది జుట్టు రాలడానికి దారి తీస్తుంది. మరి చుండ్రుకి చెక్ పెట్టేదెలా?
గాలిలోని దుమ్ము, ధూళి, కాలుష్యం, చెమట కారణంగా తలలో చుండ్రు ఏర్పడుతుంది. అయితే కొన్ని సింపుల్ ప్యాక్స్ వేసుకోవడం ద్వారా మాడు మీది చర్మం పూర్తిగా క్లీన్ అయ్యి చుండ్రు సమస్య తగ్గుతుంది. అదెలాగంటే..
మందారంతో..
మందారంలో ఉండే ఔషధ గుణాలు చర్మంలోని జిడ్డుదనాన్ని తగ్గిస్తాయి. అయితే ఇందులో మెంతుల పొడి కలపడం ద్వారా చుండ్రుకి కారణమయ్యే ఫంగస్‌ను కూడా నశింపజేయొచ్చు. కాబట్టి మందారం ఆకుల పేస్ట్‌లో కొద్దిగా మెంతుల పొడి కలిపి జుట్టుకి ప్యాక్‌గా వేసుకోవాలి. ప్యాక్ వేసుకునేటప్పుడు మాడుకి, జుట్టు కుదుళ్లకు మిశ్రమం అంటేలా మృదువుగా మర్దన చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల కొద్దిరోజుల్లోనే చుండ్రు సమస్య తగ్గుతుంది.
పెరుగుతో..
పెరుగులో ఉండే లాక్టిక్‌యాసిడ్, ప్రోబయాటిక్స్.. కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. పెరుగులో కొద్దిగా తేనె కలిపి హెయిర్ ప్యాక్ చేసుకోవడం ద్వారా మాడుపై ఉన్న ఫంగస్ వదిలిపోతుంది. ఇలా పెరుగు, తేనెతో వారానికి రెండు సార్లు హెయిర్ ప్యా్క్ వేసుకోవచ్చు.
ఉల్లి రసం
ఉల్లిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మాడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే చుండ్రు ఏర్పడ్డానికి కారణమయ్యే ఫంగస్‌ను పూర్తిగా నశింపజేస్తాయి. ఉల్లిరసంలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకి పట్టిస్తే.. చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
కలబంద
కలబంద గుజ్జులో అన్నిరకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కలబంద పేస్ట్ లో కొద్దిగా నిమరసం కలిపి తలకు ప్యాక్ లా వేసుకుంటే కొద్దిరోజుల్లోనే చుండ్రు పూర్తిగా తగ్గుతుంది.
ఇవి కూడా
చుండ్రు ఒక్కసారి మొదలైందంటే అంత ఈజీగా వదలదు. అందుకే ప్యాక్స్ వేసుకుంటూనే తలకు చెమట పట్టకుండా జాగ్రత్తపడాలి. పొల్యూషన్‌కు వెళ్లినప్పుడు వెంటనే తలస్నానం చేయాలి. జుట్టును ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
చేపలు, ఆవకాడో, నట్స్ వంటివి తినడం ద్వారా కుదుళ్లను మరింత పటిష్టంగా ఉంచుకోవచ్చు. చుండ్రు తగ్గాలంటే నూనె పదార్ధాలు, డెయిరీ ప్రొడక్ట్స్ తగ్గించాలి. నీళ్లు ఎక్కువ తాగాలి.