గ్యాస్ట్రిక్ తీవ్రమవుతున్నదా? సూచనలు ఇవే..
ఇది తీవ్రమైతే శరీరం కొన్ని సూచనలు ఇస్తుందంటున్న ఆరోగ్య నిపుణులు
ఆహార అలవాట్ల కారణంగా ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్. ఇది తీవ్రమైతే శరీరం కొన్ని సూచనలు ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గ్యాస్ సమస్యతో శక్తి హీనులుగా మారిపోతారు. పూర్తి విశ్రాంతి, నిద్ర ఉన్నా నీరసంగా అనిపిస్తుంది. శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా నిదానిస్తుంది.
రోగ నిరోధక వ్యవస్థపైనా గ్యాస్ట్రిక్ ప్రభావం చూపిస్తుంది. జలుబు, ఫ్లూతో ఇబ్బంది పడుతారు. దీర్ఘకాలిక నిర్లక్ష్యంతోపాటు వ్యాధులతో పోరాడే శక్తినీ కోల్పోతారు. ఛాతిలో, కడుపులో మంటగా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఆహారం జీర్ణమవ్వడానికి చాలా సమయం పడుతుంది.
గ్యాస్ కారణంగా ఆర్థరైటిస్ ఎటాక్ చేస్తుంది. కీళ్లల్లో వాపు, నొప్పి వంటి ఇబ్బందులు వస్తాయి. కండరాలు దృఢత్వాన్ని కోల్పోతాయి. ముఖంపై మొటిమలు పొడిబారిన చర్మం, దురద వంటి సమస్యలు వస్తాయి. చెమటతో బైటికి వెళ్లాల్సిన మలినాలు చర్మం కింద పేరుకుపోతాయి.
గ్యాస్ వల్ల మెదడుకి, ఇతర అవయవాలకు రక్తసరఫరా నిదానిస్తుంది. దీంతో మైగ్రేన్ తీవ్రంగా బాధిస్తుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉంటే దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బ తింటుంది. దీంతో పుచ్చిపోవడం, చిగుళ్ల వాపుతోపాటు నోట్లో హానికరమైన బ్యాక్టీరియా చేరుతుంది. హార్మోన్లు, మెటబాలిజంపై గ్యాస్ట్రిక్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శరీరంలో కొవ్వు పేరుకుంటుంది. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు ఫలించవని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.