Telugu Global
Health & Life Style

నాడీ వ్యవస్థకు వైద్యం చేసే ఐదు అద్భుత మార్గాలు!!

మనిషిలో మానసిక సమస్యలను తొలగించుకోవాలంటే నాడీ వ్యవస్థను ఆరోగ్యకరంగా మార్చుకోవాలి. నాడీవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ప్రముఖ సైకాలజిస్ట్ నికోల్ లెపెరా అయిదు అద్భుతమైన మార్గాలను సూచించారు.

నాడీ వ్యవస్థకు వైద్యం చేసే ఐదు అద్భుత మార్గాలు!!
X

విద్యుత్‌ ఆధారంగా పనిచేసే ఒక పరికరంలో విద్యుత్‌ తీగలు ఉంటాయి. అవి అనుసంధానం చేయబడి ఉంటాయి. వాటిలో ఏదైనా తీగ తెగిపోయినా, వాటిని తప్పుగా అనుసంధానం చేసినా ఆ విద్యుత్‌ పరికరం పనిచేయదు.

మానవ శరీర వ్యవస్థ కూడా సరిగ్గా ఇలాంటిదే. శరీరంలో ఎన్నో నరాలు తల నుండి కాలి బొటనవేలి వరకు వ్యాపించి ఉంటాయి. ఈ వ్యవస్థను నాడీ వ్యవస్థ అని అంటారు. మెదడు, వెన్నెముక, శరీరంలో ఉన్న ఇంద్రియాల ద్వారా ఈ నాడులు శరీరమంతా వ్యాపించి ఉంటాయి. శరీరంలో మెదడు, వెన్నెముక, ఇంద్రియాల మధ్య సంకేతాలను చేరవేసేవి ఈ నాడులే. అదే ఈ నాడులు వాటి పని సరిగ్గా నిర్వహించలేకపోతే జరుగుతున్న అనర్థాలే మనిషిలో శారీరకంగా ఇబ్బంది ఎదురవ్వడం, అవి మానసిక సమస్యలకు దారితీయడం, శరీరంలో సమతుల్యంగా ఉండాల్సిన హార్మోన్స్ గందరగోళం అవ్వడం.

మనిషిలో మానసిక సమస్యలను తొలగించుకోవాలంటే నాడీ వ్యవస్థను ఆరోగ్యకరంగా మార్చుకోవాలి. నాడీవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ప్రముఖ సైకాలజిస్ట్ నికోల్ లెపెరా అయిదు అద్భుతమైన మార్గాలను సూచించారు.

విటమిన్-బి బ్యాలెన్స్!!

◆ శరీరం సమర్థవంతంగా పనిచేయాలంటే ఒకో భాగానికి ఒకో విధమైన విటమిన్ అవసరమవుతుంది. నాడీవ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి విటమిన్-బి స్థాయిలు తగినంతగా ఉండటం అవసరం.

◆ విటమిన్ బి1, బి6, బి12, అసిటైల్కోలిన్, సెరోటోనిన్, నోర్‌పైన్‌ఫ్రైన్ మొదలైనవి న్యూరోట్రాన్స్ మీటర్ ల సంశ్లేషణలో సహాయపడతాయి.

◆ న్యూరోట్రాన్స్ మీటర్లు నాడీవ్యవస్థను, దాని పనితీరును నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

కోల్డ్ ఎక్స్పోజర్!!

◆ శరీరాన్ని చలికి, చల్లదనానికి గురిచేయడం, దాన్ని ఓపికగా భరించడం అనేది విచిత్రంగా అనిపిస్తుంది..

◆ చల్లదనానికి శరీరంలో ఉన్న నాడులు ఉద్దీపన చెందుతాయి. ఒక టబ్ లో నీటిని నింపి మంచుముక్కలు వేసి అందులో చేతులు లేదా కాళ్ళు పెట్టడం, ఆ చల్లదనాన్ని భరించడం వల్ల నాడుల స్పందనలు పెరుగుతాయి.

◆ మాఘమాసం, కార్తీకమాసంలో చన్నీటి స్నానాన్ని పెద్దలు, ప్రాచీన మహర్షులు సూచించడం వెనుక ఇదే కారణం ఉంది.

◆ నాడులను ఇలా ఉద్దీపన చెందించడం వల్ల శరీరంలో అంతర్లీనంగా మరుగున పడిన చైతన్యం మేల్కొంటుందని, ఇది మానసిక ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరుస్తుందని నికోల్ లెపెరా తెలిపారు.

ఉదయకాంతి!!

◆ తెల్లవారుఝామున సూర్యుడు ఉదయించేటప్పుడు వెలువడే లేత కిరణాలు మానవ నాడీవ్యవస్థను ప్రభావితం చేస్తాయి.

◆ ఈ సూర్యకాంతి శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ ను సమతుల్యంగా మారుస్తుంది. (సిర్కాడియన్ రిథమ్ అంటే శరీరంలో నిద్రకు సంబంధించిన ఒక వ్యవస్థ. ఇది ప్రతి 24 గంటలకు ఒకసారి రిపీట్ అవుతుంటుంది) దీనివల్ల రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

◆ నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలను తొందరగా పరిష్కరించుకోవడానికి నిద్ర అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.

లిమిట్స్ పెట్టుకోవడం!!

◆ మానసికంగా కొన్ని పనులు చేస్తున్నప్పుడు మార్పుచెందే భావోద్వేగాలను అనుసరించి హద్దులు కోల్పోతారు. అది మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, పనులు చేస్తున్నప్పుడు కావచ్చు.

◆ లిమిట్స్ పెట్టుకోవడం వల్ల ప్రతిదాన్ని ఒకచోట తమకు తాము ఆపడం జరుగుతుంది. ఇది శరీరంలో ఉన్న నాడులను అదుపుచేసే ప్రక్రియ అవుతుంది. దీనివల్ల నాడులను ఎవరి ఆధీననంలోకి వారు తెచ్చుకోవచ్చు.

నిశ్చల స్థితికి రావడం!!

◆ చాలామందిలో చేస్తున్న పని అయినా ఇతర విషయాలు అయినా అవి ఇంకా కొనసాగించాల్సినప్పుడు వ్యక్తులు వాటి నుండి విరామం తీసుకోరు.

◆ పనుల మధ్యలో నిశ్చల స్థితిని పొందడానికి ప్రయత్నిస్తే నాడుల ఒత్తిడిని క్రమంగా ఒక గాడిలో పెట్టవచ్చు. అన్ని విషయాలకు కంపనాలకు లోనుకాకుండా చేసుకోవచ్చు.

నికోల్ లెపెరా చెప్పినట్టు అయిదు మార్గాలను అనుసరిస్తే శరీరంలో ఉన్న నాడీవ్యవస్థను, దాని పనితీరును ఆరోగ్యంగా ఉంచుకుని మానసిక సమస్యలను తగ్గించుకోవచ్చు.

First Published:  18 July 2022 5:20 PM IST
Next Story