ఫెర్టిలిటీ సమస్యలను పోగొట్టే పోషకాలివే..
సరైన డైట్, లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల చాలామంది స్త్రీలు ఫెర్టిలిటీ సమస్యల బారిన పడుతున్నారు.
సరైన డైట్, లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల చాలామంది స్త్రీలు ఫెర్టిలిటీ సమస్యల బారిన పడుతున్నారు. మాతృత్వానికి దూరమై అద్దె గర్భం, ఐవీఎఫ్ లాంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే ఆరోగ్యాన్ని కాస్త సరిచేసుకోవడం ద్వారా ఫెర్టిలిటీ సమస్యలను సహజంగానే తగ్గించుకోవచ్చంటున్నారు డాక్టర్లు. సంతానలేమి లేదా ఇతర ఫెర్టిలిటీ సమస్యలున్నవాళ్లు ఎలాంటి డైట్ తీసుకోవాలంటే..
మహిళల్లో పీసీఓఎస్, థైరాయిడ్, ఒబెసిటీ, హార్మోనల్ ఇంబాలెన్స్ లాంటి సమస్యలు ఇన్‌ఫెర్టిలిటీకి దారితీస్తున్నాయి. అందుకే ఇలాంటి సమస్యలున్నవాళ్లు ముందుగా వాటికి అదుపులో ఉంచుకోవాలి.
సంతానలేమి సమస్యలు రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సీ, విటమిన్ ఈ, ఫోలేట్, బీటా కెరోటిన్, లూటిన్.. వంటివి ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలు, నట్స్, ధాన్యాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి.
హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న మహిళలు మరిన్ని ఎక్కువ పోషకాలు తీసుకోవాలి. ఒత్తిడిని అదుపుచేయాలి. రోజువారీ వ్యాయామాలు చేయాలి. అధిక బరువు ఉంటే తగ్గించే ప్రయత్నం చేయాలి. మానసిక ఆరోగ్యం బాగుంటే శరీరంలో ఇన్సులిన్, ఈస్ట్రోజెన్ లెవల్స్ సరిగ్గా ఉంటాయి.
రోజువారీ డైట్‌లోట్రాన్స్ ఫ్యాట్స్, షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ అమాంతం పెరిగి గర్భధారణపై నెగెటివ్ ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఫెర్టిలిటీ సమస్యలు రాకూడదంటే.. ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బేక్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
పీసీఓఎస్ సమస్య ఉన్న వారిలో ఒబెసిటీ, నెలసరి సమస్యల వంటివి కామన్‌గా కనిపిస్తుంటాయి. అందుకే పీసీఓఎస్‌కు తప్పక మందులు వాడాలి. అలాగే ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేలా జాగ్రత్తపడాలి. బరువు కంట్రోల్‌లో ఉంచుకోవాలి.