Telugu Global
Health & Life Style

ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దు!

ముఖాన్ని అందంగా ఉంచుకోవడం కోసం చాలామంది రకరకాల ఫేస్ వాష్‌లతో ముఖాన్ని కడుక్కుంటుంటారు. అయితే ఇదీ మరీ ఎక్కువగా చేయకూడదంటున్నారు డాక్టర్లు. ఎక్కువసార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువంటున్నారు.

ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దు!
X

ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దు!

ముఖాన్ని అందంగా ఉంచుకోవడం కోసం చాలామంది రకరకాల ఫేస్ వాష్‌లతో ముఖాన్ని కడుక్కుంటుంటారు. అయితే ఇదీ మరీ ఎక్కువగా చేయకూడదంటున్నారు డాక్టర్లు. ఎక్కువసార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువంటున్నారు. అసలు ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలంటే..

సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కోరకమైన చర్మతత్వం ఉంటుంది. కొందరికి జిడ్డు చర్మం, మరికొందరికి పొడిచర్మం ఉంటుంది. ఈ చర్మతత్వాన్ని బట్టి ఫేస్ వాష్ ఉండాలి. రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాలనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సాధారణ చర్మతత్వం గలవారు రోజులో ఒకట్రెండుసార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే చాలు. జిడ్డు చర్మం ఉన్న వాళ్లు మూడు నాలుగు సార్లు చేసుకున్నా పర్వాలేదు. ఇక పొడి చర్మం ఉన్నవాళ్లయితే ఒకట్రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకుని వెంటనే మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే సహజమైన నూనెలు తొలగిపోతాయి. అలాగే చర్మాన్ని పొడిబారకుండా కాపాడే సీబం అనే పదార్థం కూడా తొలగిపోతుంది. దానివల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి త్వరగా పొడిబారుతుంటుంది. కాబట్టి రోజుకి మూడు సార్లకు మించి ఫేస్ వాష్ చేసుకోకపోవడమే బెటర్.

ఇక ఫేస్ వాష్‌లను ఎంచుకునే విషయానికొస్తే.. వీలైనంత వరకూ గాఢత తక్కువగా ఉండే ఫేస్‌వాష్‌లను ఉపయోగించాలి. అలాగే ఫేస్ వాష్ ను ఎంచుకునేముందు ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేయడం మర్చిపోవద్దు. మీ చర్మ తత్వాన్ని బట్టి దానికి నప్పే ఫేస్ వాష్‌ను మాత్రమే ఎంచుకోవాలి.

ఫేస్ వాష్‌కు బదులుగా ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం, ముఖానికి నూనె పట్టించి గంట తర్వాత స్నానం చేయడం వంటివి చేయొచ్చు. ఇలా చేయడం వల్ల చర్మానికి కావల్సిన పోషకాలు అందుతాయి. ఫలితంగా చర్మం మృదువుగా, బ్రైట్‌గా మారుతుంది.

First Published:  12 Aug 2023 1:24 AM IST
Next Story