Telugu Global
Health & Life Style

పొడిచర్మమా? పోషకాల లోపం కావొచ్చు!

శరీరంలో సూక్ష్మపోషకాల లోపం వల్ల చాలామంది చర్మం పొడిగా మారుతుంటుంది. అందుకే చర్మం పొడిబారుతున్నప్పుడు పోషకాల లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి.

పొడిచర్మమా? పోషకాల లోపం కావొచ్చు!
X

పొడిచర్మమా? పోషకాల లోపం కావొచ్చు!

శరీరంలో సూక్ష్మపోషకాల లోపం వల్ల చాలామంది చర్మం పొడిగా మారుతుంటుంది. అందుకే చర్మం పొడిబారుతున్నప్పుడు పోషకాల లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. పొడి చర్మం సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి పోషకాలు తీసుకోవాలంటే..

విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్.. ఇవన్న కలిసి చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. విటమిన్, మినరల్ లోపాలుంటే ఆ ఎఫక్ట్ మొదటగా చర్మంపై పడుతుంది. చర్మంపై ముడతలు, దురద, పగుళ్లు లాంటి సమస్యలు వస్తుంటే డైట్‌లో కొన్ని ఫుడ్స్ చేర్చుకోవాలి.

విటమిన్ బీ : బీ విటమిన్లు శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, పిండి పదార్థాలతో పాటు చర్మం, జుట్టుకు అవసరమైన కొవ్వులను అందజేస్తాయి. చర్మం, పెదవుల హైడ్రేషన్‌కు విటమిన్ బీ2 అవసరం. బీ12, బీ6 లోపం వల్ల చర్మం డ్రైగా మారుతుంది. చేపలు, మాంసం, పాలు, గుడ్లు, తృణధాన్యాలు, కూరగాయలు వంటివి తీసుకుంటే విటమిన్ బి తగిన పాళ్లలో అందుతుంది.

విటమిన్ ఎ : చర్మ కణాల మరమ్మతుకి విటమిన్ ఎ అవసరం. ఎ విటమిన్ లోపం వల్ల చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయి. దానివల్ల రకరకాల చర్మ సమస్యలు వేధిస్తాయి. క్యారెట్, బచ్చలికూర, బత్తాయి, నారింజ, మామిడి, బొప్పాయి, చేపలు, గుడ్డు, సోయాబీన్ లాంటివి తినడం ద్వారా విటమిన్ ఎ పొందొచ్చు.

విటమిన్ డి : పొడి చర్మం విటమిన్ డి లోపానికి కూడా సంకేతం కావొచ్చు. చర్మంపై మొటిమలు, ముడతలు, రాకుండా నిరోధించడంలో విటమిన్ డి సాయపడుతుంది. చర్మ సంరక్షణకు విటమిన్ డి ఎంతో అవసరం. అందుకే రోజూ ఉదయం ఎండలో కాసేపు నడవాలి. ఒంటికి సూర్యకిరణాలు తాకేలా చూసుకోవాలి.

విటమిన్ ఇ : చర్మాన్ని తేమగా ఉంచడంలో విటమిన్ ఇ సాయపడుతుంది. ఇది చర్మంలోని లిపిడ్లకు నూనె అందిస్తుంది. విటమిన్ ఇ లేకపోతే చర్మం వెంటనే పొడిబారి, పగిలిపోతుంది. అందుకే చర్మ సమస్యలు ఉన్నవాళ్లు బాదం, వేరుశెనగ, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ విత్తనాలు, సోయాబీన్ నూనె వంటివి తినాలి.

విటమిన్ సి : చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి అవసరం. అందుకే చర్మం పొడిబారుతున్నవాళ్లు సిట్రస్ పండ్లు, టొమాటో, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ వంటివి తినాలి.

జింక్ : జింక్ లోపం వల్ల సోరియాసిస్, డ్రై స్కాల్ప్, డెర్మటైటిస్ వంటి అనేక చర్మ సమస్యలు వస్తాయి. అందుకే చర్మ సమస్యలున్నవాళ్లు జింక్ లోపం లేకుండా చూసుకోవాలి. రెడ్ మీట్, గుడ్లు, బీన్స్ వంటివాటిలో జింక్ ఉంటుంది.

First Published:  1 Dec 2022 3:43 PM IST
Next Story