Telugu Global
Health & Life Style

డ్రై ఫ్రూట్స్‌ కి ఒక లెక్కుంది !

రోజూ కొన్ని డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటే.. నీరసం దరిచేరదు. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. నట్స్‌లో విటమిన్ ఈ, కాల్షియం, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్‌ కి ఒక లెక్కుంది !
X

మన శరీరంలోని సమస్యలన్నీ పోషకాహార లోపం వల్ల ఏర్పడతాయి. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్లనే అనేక సమస్యలు తలెత్తుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్‌ కూడా కావాల్సివే. అయితే ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కదా అని నచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. డ్రైఫ్రూట్స్‌ తినేప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే .. ఇంకా మెరుగైన లాభాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

రోజూ కొన్ని డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటే.. నీరసం దరిచేరదు. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. నట్స్‌లో విటమిన్ ఈ, కాల్షియం, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్‌ బి, నియాసిన్, థయామిన్, ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీ లు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని లిమిట్ గా తీసుకోవాలి.

బాదం... ఇందులో మోనో శ్యాచురేటెడ్‌ యాసిడ్స్‌ ఎక్కువ గా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్‌ ఈ, మెగ్నీషియం, ΄పోటాషియం ఉంటాయి. ఇవి రక్తప్రరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అయితే ఇవి రోజుకి 4 నుంచి 7 బాదం మాత్రమే తినాలి.

వాల్‌ నట్స్‌.. ఇవి అంత రుచిగా ఉండవు . కానీ వీటిలో 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్‌ యాసిడ్స్, టాన్నిన్స్, ఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 వరకు తీసుకోవచ్చు.

కర్జూరం... ఇందులో న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్‌ ఇందులో రిచ్‌ గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. రోజుకి మీడియం సైజులో ఉండే ఖర్జూరం రోజుకి ఒకటి లేదా 2 తీసుకోవచ్చు.

పిస్తా... పిస్తా బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్‌ లో కంటే ప్రోటీన్ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

జీడిపప్పు.. రుచికరంగా ఉండే జీడిపప్పు రెగ్యులర్‌ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బాగుంటాయని వీటిని ఎక్కువగా తినడం వల్ల మాత్రం అనారోగ్యమే వస్తుంది. రోజుకు నాలుగు జీడిపప్పులను మాత్రమే తినడం ఆరోగ్యకరం.

ఎండుద్రాక్ష... ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. ఇందులో విటమిన్‌ బి, ΄పోటాషియం, ఐరన్‌ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి కాస్త ఎక్కువ ఎండుద్రాక్ష తినవచ్చు. అంటే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల వరకు తీసుకోవచ్చు.

First Published:  25 Jun 2024 6:00 AM IST
Next Story