Telugu Global
Health & Life Style

ఒత్తిడే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు

దీనివల్ల అనారోగ్యంతో పాటు చర్మ, జుట్టు సమస్యలూ వస్తాయంటున్న ఆరోగ్య నిపుణులు

ఒత్తిడే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు
X

ఒత్తిడే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల అనారోగ్యంతో పాటు చర్మ, జుట్టు సమస్యలూ వస్తాయంటున్నారు. ఒత్తిడితో ఆందోళనకు గురైతే.. దురద, దద్దుర్లు రావడంతో పాటు చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. యాంగ్జైటీ వల్ల ఎడ్రినలిన్‌, కార్టిసాల్‌ హార్మోన్లు విడుదల అవుతాయి. వీటితో చర్మానికి రక్త ప్రసరణ తగ్గుతుంది.

ఒత్తిడి ఎక్కువ అయితే చర్మం నుంచి నూనెలు విడుదలవుతాయి. దీంతో ముఖంపై మొటిమలు వస్తాయి. చర్మం వాపునకు గురవుతుంది. దీంతో శరీరం ఉబ్బినట్టు కనిపిస్తుంది. తామర, సొరియాసిస్‌ వంటి సమస్యలను ప్రేరేపిస్తుంది. కొలాజెన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. చర్మం వదులు అవడంతో పాటు చిన్నవయసులోనే మచ్చలు, మడతలు వస్తాయి.

ఒత్తిడి కారణంగా మెలనోసైట్స్‌ కణాలు వృద్ధి చెందుతాయి. దీంతో దీర్ఘకాలంలో జుట్టు రాలడంతో పాటు తెల్ల జుట్టు సమస్య వెంటాడుతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం కుటుంబతో గడపటం, యోగా, ధ్యానం చేయడం వల్ల కొంతమేర ఒత్తిడి తగ్గింతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఏ విషయం వల్ల ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నారో గుర్తించి అవి పదే పదే జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

First Published:  29 Jan 2025 9:45 AM IST
Next Story