Telugu Global
Health & Life Style

జుట్టు ఊడిపోతోందా? ఇలా చేసి చూడండి!

జుట్టు రాలిపోవడం, బట్ట తల వంటి సమస్యలు ఇప్పటి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

జుట్టు ఊడిపోతోందా? ఇలా చేసి చూడండి!
X

జుట్టు రాలిపోవడం, బట్ట తల వంటి సమస్యలు ఇప్పటి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దీనికి పోషకాల లోపం కంటే మానసిక ఒత్తిడే ముఖ్య కారణంగా ఉంటోందట. ఒత్తిడి వల్ల జుట్టు రాలడం, జుట్టు రాలుతున్న కారణంగా మరింత డిప్రెషన్‌కు లోనవ్వడం.. ఇలా సమస్య దానికదే ముదురుతోంది. మరి దీనికి చెక్ పెట్టేదెలా?

జుట్టు రాలడానికి గల కారణాల్లో ఒత్తిడి ప్రధానమైనది. ఎక్కువకాలం పాటు ఒత్తిడికి లోనవుతుంటే శరీరంలో జరిగే హార్మోనల్ మార్పుల వల్ల టెలోజెన్ ఎఫ్లువియం అనే కండిషన్ ఏర్పడుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు పలుచబడి క్రమంగా జుట్టు రాలిపోతుంటుంది. కొన్నిసార్లు కుదుళ్లు పూర్తిగా వీక్ అయ్యి బట్టతలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి ఒత్తిడి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

జుట్టు రాలడానికి ఒత్తిడి అనేది ప్రధాన కారణం. కాబట్టి ఒత్తిడిపైనే ఫోకస్ పెట్టాలి. జుట్టు రాలుతుందని మళ్లీ ఒత్తిడిలోకి వెళ్లకూడదు. జుట్టు రాలినా.. మళ్లీ అదే పెరుగుతుంది. అన్న ధోరణిలో జుట్టు గురించి మర్చిపోవాలి. జుట్టు రాలడాన్ని కేవలం ఒత్తిడికి ఒక సంకేతంగా భావించాలి. ఒత్తిడి వల్ల కలిగే మిగతా అనారోగ్యాలతో పోలిస్తే జుట్టు రాలడం అనేది చిన్న సమస్య అని తెలుసుకోవాలి. ఒత్తిడి లేని లైఫ్‌స్టైల్‌పై ఫోకస్ పెట్టాలి.

ఒత్తిడి తగ్గించుకునేందుకు లైఫ్‌స్టైల్‌లో తగిన మార్పులు చేసుకోవాలి. ఎక్కడ ఎక్కువ ఒత్తిడి కలుగుతుందో తెలుసుకుని అక్కడ తగిన మార్పులు చేసుకోవాలి. పని వల్ల ఒత్తిడి కలుగుతుంటే వర్కింగ్ స్టైల్‌ను మార్చుకునే ప్రయత్నం చేయాలి. టైం టేబుల్‌ను మార్చుకుని మీకోసం కొంత సమయం కేటాయించుకోవాలి. రోజులో ఒక అరగంట వ్యాయామం లేదా ఆటలకు కేటాయించాలి. అలాగే మరో అరగంట నచ్చిన వ్యక్తులతో గడిపేలా చూసుకోవాలి. ఒత్తిడి గురించి పూర్తిగా మర్చిపోయి హ్యాపీగా ఉండేందుకు ఏం చేయాలో చూడాలి. ఒత్తిడి గురించి మళ్లీ ఒత్తిడి పడకూడదు. ఇలా చేయడం ద్వారా జుట్టు రాలడం ఒక్కటే కాదు, చాలా రకాల అనారోగ్యాలు తగ్గిపోతాయి.

First Published:  3 July 2024 4:09 PM IST
Next Story